టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌లుగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు.. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ఓ పక్కన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో.. మరో పక్కన ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా హీరోలుగా మారిన తరువాత చరణ్, తారక్ నుంచి వస్తున్న మొదటి సినిమాలు ఇవే కావడంతో.. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
త్వరలోనే ఈ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు ఇద్దరు స్టార్ హీరోస్.
ఇలాంటి క్రమంలో ఈ రెండు సినిమాలు మధ్యన చాలా కామన్ క్వాలిటీస్ ఉన్నాయంటూ వార్తలు నెటింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ కామన్ క్వాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. తండ్రి ఆశయాన్ని గెలిపించడం కోసం పోరాడే కొడుకుగా రాంచరణ్.. గేమ్ చేంజర్ సినిమాలో కనిపించనున్నాడు. ఇదే తరహాలో దేవర సినిమాలో ఎన్టీఆర్ కూడా ఇదే లైన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరూ తమ సినిమాల్లో తండ్రి కొడుకులు గా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల్లోనూ తండ్రి తమకు అత్యంత సన్నిహితులైన వారిచేతో ఘోరంగా మోసపోవడం.. దానికోసం కొడుకుల రివేంజ్ తీసుకోవడం కామన్ కథంశంగా ఉంది. ఇలా ఈ రెండు సినిమాలు బ్యాక్‌డ్రప్ వేరైనా.. కథ ఒకటేనంటూ నెటింట కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే దేవర యాక్షన్ జానర్‌లో సాగే సినిమా కాగా.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. అలాగే ఈ సినిమాల్లో వీరిద్దరి గెటప్లు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎన్టీఆర్, చరణ్ కథలను ఎంచుకోవడంలో చాలా డిఫరెన్స్ ఉంది.
దేవర రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ సింగిల్ సినిమాగా వస్తుంది. అయితే ప్రస్తుతం ఇద్దరు సినిమాలకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. రాజమౌళితో పనిచేసే సూపర్ హిట్ అందుకున్న స్టార్ హీరోస్ ఇప్పటివరకు తమ తర్వాత సినిమాలతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా ఉంది. మరి ఈసారైనా వీరిద్దరూ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి తమ సినిమాలతో సక్సెస్ అందుకుంటారు లేదో వేచి చూడాలి.