స్టార్ హీరోయిన్‌గా ఎదగాల్సిన ఈ అమ్మడు.. ఇలా ఎందుకు మిగిలిపోయిందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు నటవారసులుగా ఎంతోమంది అడుగుపెడుతూనే ఉంటారు. అయితే కేవలం వారిలో ఉన్న టాలెంట్ మాత్రమే వారిని గొప్ప వాళ్ళుగా నిలబడుతుంది. అలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ వారసులు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ పేరును కాపాడుకోలేకపోయారు. పైగా తల్లిదండ్రులకు ఉన్న పేరు వారి కెరీర్‌కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ఇలా చాలామంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా మారలేకపోయారు. ఇలా చాలామంది నట వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన.. అందం, టాలెంట్ ఉన్నా కూడా కేవలం అదృష్టం కలిసిరాక సెలబ్రెటీలుగా రాణించలేకపోయారు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ అమ్మడు కూడా ఈ జాబిత‌లోకే వ‌స్తుంది.

ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఎందుకు ఆమె హీరోయిన్గా ఎదగలేకపోయిందో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ నటి శోభా.. వేదాంతం రాఘవయ్య, సూర్యప్రభ దంపతుల కుమార్తె. వేదాంతం రాఘవయ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి తరం హీరో. ఎన్టీఆర్, ఏఎన్నార్ల కంటే ముందు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన భార్య సూర్యప్రభ మంచి నటి. వీళ్లిద్దరూ మొదటి తరం స్టార్ సెలబ్రెటీలుగా స్థిరపడ్డారు. ఇక సూర్యప్రభ చెల్లెలు పుష్పవల్లి కూతురే ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ పాపులారిటి దక్కించుకుని దూసుకుపోతున్న రేఖ.

కాగా రేఖకు పెద్దమ్మ అయినా సూర్య ప్రభ కూతురు శోభ మాత్రం హీరోయిన్ గా ఎదగలేక పోయింది. అందం, న‌ట‌నలో టాలెంట్ ఉన్నప్పటికీ హీరోయిన్‌గా రాణ‌ఱించ‌లేక చిన్న వయసులోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గూడుపుఠాణి సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ సర్జన హీరోయిన్గా ఆకట్టుకుంది. ఇది శోభకు హీరోయిన్గా మొదటి సినిమా.. ఈ సినిమా తర్వాత చాలా కొద్ది కాలానికి ఏవో కారణాలతో క్యారెట్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టేసింది. తల్లి పాత్రలో ఆమె మంచి గుర్తింపు వ‌చ్చింది. అలా ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి తల్లి పాత్రలో నటించిన శోభ.. అన్నమయ్య సినిమాలో నాగార్జునకు తల్లిగా నటించి మెప్పించింది.

కాగా మన ఊరి పాండవులు, విజేత లాంటి సినిమాల్లో కూడా అంద‌రిన‌ని ఆకట్టుకుంది. ఏప్రిల్ 1న‌ విడుదల సినిమాలో.. తన న్యాచుర‌ల్ న‌ట‌న‌తో ప్రేక్షకులను మెప్పించింది. అయితే టాలీవుడ్ లో ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో.. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుని.. బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక‌ హీరో శోభన్ బాబు నటించిన కోడెనాగు సినిమా ఒరిజినల్ వర్షన్‌ కన్నడలో.. ఈ అమ్మడే హీరోయిన్గా నటించి అక్కడ ఆడియన్స్ మెప్పించింది. ఇక ప్రస్తుతం తరంలో ఈలాంటి నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దొరకడం అనేది సాధ్యం కాదు.