సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టి భారీ పాపులారిటీ క్రేజ్‌ను సంపాదించుకుని దూసుకుపోతూన్నారు. అలాంటి వారిలో తమిళ్ హీరోలు కూడా ఎంతోమంది ఉన్నారు. తమిళ్లో కెరీర్ ప్రారంభించి.. టాలీవుడ్ లో అడుగుపెట్టి భారీ పాపులారిటి, క్రేజ్ అందుకుంటున్నారు. ఆ లిస్టులోకే వస్తాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోను ఇమేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ హీరో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను మాత్రం ఫ్యాన్స్ తో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు.
అందులో భాగంగానే ఆయనకు గత నెలలో కొడుకు పుట్టాడని.. సోషల్ మీడియా వేదికగా వివరించాడు. తాజాగా తన మూడో కొడుకు నామకరణం సందర్భంగా స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. హీరోగా తాను సక్సెస్ అవ్వకముందే ఆర్తిని వివాహం చేసుకున్న కార్తికేయన్.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. మొదట ఆరాధన అనే కూతురు, గగన్ అనే కొడుకు పుట్టగా.. ఇప్పుడు మరో బిడ్డ తన ఫ్యామిలీలో యాడ్ అయిపోయాడు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు.. ఎంతమంది సినీ సెలబ్రిటీస్ అతనికి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా మూడో బిడ్డ నామకరణ వేడుకను ఘనంగా జరిపిన శివ కార్తికేయన్.. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భార్య గురించి మాట్లాడుతూ.. ప్రశంసల వర్షం కురిపించాడు.
అర్తి నువ్వు బిడ్డను కనడానికి ఆపరేషన్ థియేటర్లో పడిన వేదన నేను పక్కనే ఉండి చూసా.. నువ్వు పడిన బాధ ఏంటో నాకు తెలుసు.. అందమైన ప్రపంచాన్ని నాకు ఇవ్వడం కోసం నువ్వు పడినా బాధకు నేను జీవితాంతం రుణపడి ఉంటా.. లవ్ యు అంటూ తన భార్య గురించి ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు. ఇక ఈ వీడియో చివర్లో మీ అందరి ఆశీస్సులతో మా చిన్నోడికి మేము పేరు పెట్టుకున్నాం. మా మూడో బిడ్డ పేరే పవన్ అంటూ ” పవన్ శివ కార్తికేయన్ ” పేరుతో వీడియోను పూర్తి చేశాడు. ఇక శివ కార్తికేయన్ తన కొడుకుకు పవన్ పేరును పెట్టడంతో.. మన పవర్ స్టార్ పేరుని శివ కార్తికేయన్ తన కొడుకుకు పెట్టాడంటూ ” పవన్ శివకార్తికేయన్ ” పేరు తెగ వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు.