ఉదయ్ కిరణ్ బర్త్ డే స్పెషల్: ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు పెద్ద స్టార్ గా ఉండేవాడుగా..!

ఉదయ్ కిరణ్ .. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయిన ఒక హీరో . ఇతగాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . ఒకప్పుడు ఈయన నటించిన సినిమాలు ఎంతలా హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాలా..? అమ్మాయిలు అయితే ఏకంగా ఇతగాడి ఫోటో పేపర్లో పడితే ఆ ఫోటోని కట్ చేసి మరి బుక్స్ లలో దాచుకునే వాళ్ళు..స్టార్ హీరోల కూతుర్లు కూడా ఉదయ్ కిరణ్ అంటే పడి చచ్చిపోయారు అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

అయితే ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా మారాడో.. అంతే త్వరగా ఆయన డమాల్ అంటూ తన క్రేజ్ ను పడగొట్టుకునేసాడు . అంతేకాదు ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు .అయితే ఉదయ్ కిరణ్ చేసిన ఒక్క తప్పే ఆయన జీవితాన్ని నాశనం చేసేసింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . గుడ్డిగా ఫ్రెండ్షిప్ ను నమ్మి రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా సరే సినిమాలు చేయడం తర్వాత రెమ్యూనరేషన్ ఇస్తాను అని చెప్తే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయడం.. ఆయన కెరియర్లో తీసుకున్న పరమ చెత్త డెసిషన్ అని ..

చాలామంది ఆయనను ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేశారు అని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అవ్వడంతో ఆయనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఫైనాన్షియల్ గా తొక్కేశారు అని .. అలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కోలేకనే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించాడు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . నేడు ఆయన పుట్టినరోజు.. ఆయన గురించి తలుచుకొని తలుచుకొని బాధపడిపోతున్నారు . ఒకవేళ ఉదయ్ కిరణ్ ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ గా ఉండేవాడు అంటూ గుర్తు చేసుకుంటున్నారు..!