అయ్యయ్యో..పాపం..కల్కి సినిమాలో అనుష్క మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

టైం బాగోలేకపోతే ఎవరు ఏం చేస్తారు..? ఏమీ చేయలేరు.. అది ఎంత పెద్ద స్టార్ అయినా.. ఎంత పెద్ద తోపైనా సెలబ్రిటీ అయినా.. ప్రజెంట్ అనుష్క కూడా అదే సిచువేషన్ ఫేస్ చేస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నచ్చిన కూడా ఆ క్యారెక్టర్స్ ని వదిలేసుకుంటుంది. రీజన్ ఏంటో ఆమెకే తెలియాలి .. మరీ ముఖ్యంగా ప్రభాస్ అనుష్కల జోడి అంటే అందరికీ బాగా నచ్చుతుంది . ఈ జోడి రియల్ జంట అయితే బాగుంటుంది అంటూ కూడా ఆశపడుతున్నారు ఫ్యాన్స్.

అయితే అనుష్క శెట్టి ఒక బిగ్ బంపర్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అనుష్క శెట్టి కల్కి సినిమాలో ఒక ఇంపార్టెంట్ హైలెట్ అయ్యే క్యారెక్టర్ ని మిస్ చేసుకునింది అంటూ ప్రచారం జరుగుతుంది . నిజానికి ఈ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ లో అనుష్క శెట్టి నే ఊహించుకున్నాడట నాగ్ అశ్వీన్. ఆమె ఈ పాత్రకు ప్రాణం పోయగలరు అంటూ ఫిక్స్ అయ్యాడట . ఆమెను కూడా అప్రోచ్ అయ్యారట .

కానీ స్వీటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్లు అనుష్క సాగదీసిందట. అయితే అప్పటికే చాలామంది ప్రభాస్ అనుష్కల కాంబో చాలా సార్లు రిపీట్ అయింది అని.. పెద్దగా ఫ్రెష్ ఫీలింగ్ కలగదు అని .. ఆ క్యారెక్టర్ లో ఎవరైనా వేరే హీరోయిన్ తీసుకుంటే సినిమాకి హైప్ తో పాటు కొత్త కాంబో సెట్ చేసిన క్రెడిట్ కూడా వస్తుంది అంటూ సజెస్ట్ చేశారట . దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి దీపికా పదుకొనే గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో నటించాలి అని ఉంది అంటూ కోరికను బయటపెట్టింది . ఆ వీడియో వైరల్ అవ్వడంతో నాగ్ అశ్వీన్ ఏకంగా దీపిక పదుకొనే కోరికను తీర్చేసాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!