మరి కొద్ది గంటల్లో కల్కి సినిమా రిలీజ్ .. అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన నాగ్ అశ్విన్..!

కల్కి ..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో మనకు బాగా తెలిసిందే. కొందరైతే సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు . బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఒక క్రేజీ హిట్ అందుకోబోతున్నాడు ప్రభాస్ ఈ కల్కి సినిమా ద్వారా అంటూ ఇప్పటికే టాక్ బాగా వినిపిస్తుంది . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ 600 కోట్లకు పైగానే ఖర్చు చేశారు . ఇప్పటికే ట్రేడ్ వర్గాలు ఈ సినిమా 1200 కోట్లు కలెక్ట్ చూస్తుంది అంటూ అంచనా వేస్తున్నారు.

మొదటి రోజే వంద కోట్లు దాటేస్తుందట . కేవలం ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే ఈ రేంజ్ లో ఉంటే ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు మరి కొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగా సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపడింది . ఈ సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ లో సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించబోతున్నారట . అశ్విని దత్ సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఎంత పెద్ద వీర అభిమాని అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .

నిజానికి తెరపై కృష్ణుడిగా చూడాలి అంటే అది రామారావు గారి తర్వాతే ఎవరైనా .. ఎంతమంది ఎంత బాగా నటించినా మనకి కృష్ణుడు అనగానే మొదటగా ఆయన రూపమే గుర్తొస్తుంది .. అలాంటి ఓ చెరగని స్థానాన్ని అందుకున్నాడు సీనియర్ ఎన్టీ రామారావు గారు .. అయితే ఏఐ ఎఫెక్ట్స్ తో పలు టెక్నిక్స్ ఉపయోగించి కృష్ణుడి క్యారెక్టర్ లో మళ్లీ జనాలకు తెరపై సీనియర్ ఎన్టీ రామారావు గారిని చూపించబోతున్నాడట నాగ్ అశ్వీన్. కరెక్ట్ గా మరొక 24 గంటల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగా ఈ విషయం మీడియాకు లీక్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఇంటర్నెట్ ని కల్కి కొత్త అప్డేట్ షేక్ చేసి పడేస్తుంది..!!