నా కూతుర్ని ఏడిపించిన మీకు ఈ తల్లి శాపం కచ్చితంగా తగులుతుంది.. వాళ్లపై ఫైర్ అయినా రేణు దేశాయ్..?!

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ నెటిజ‌న్లు మధ్య గత కొంతకాలంగా ఓ చిన్న యుద్ధమే చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్‌లు అదే పనిగా రేణు దేశాయ్.. ఆమె పిల్లలు ఆఖీరా నందన్, ఆధ్యాలను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ పలు ట్రోల్స్ చేస్తే ఇబ్బంది పెడుతున్నారు. వాటిపై ఎప్పటికప్పుడు రేణు దేశాయ్ స్పందిస్తు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నా.. ఈ ట్రోల్స్, మీమ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇటీవల డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ వేడుక అనంతరం భార్య అనాలేజనోవా, అఖిరానందన, ఆద్యాల తో కలిసి పవన్ కళ్యాణ్ ఫోటోకు స్టిల్ ఇచ్చారు. అయితే ఈ ఫోటోపై కూడా కొందరు విపరీతంగా మీమ్స్‌, ట్రోల్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. దీంతో రేణు దేశాయ్ లాంటి మీమర్లపై ఫైర్ అయ్యింది.

Renu Desai: 'నా పిల్లలే నాకు తిరిగి జీవితాన్నిఇచ్చారు'.. అకీరా, ఆద్యలను చూసి మురిసిపోతోన్న రేణూ దేశాయ్‌ - Telugu News | Actress Renu Desai Feels Proud For Akira Nandan And Aadya ...

ఆమె మాట్లాడుతూ మనుషులు ఇంత‌ దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద స్టోరీ నే షేర్ చేసుకుంది. తన తల్లి గురించి ఇష్టం వచ్చినట్లు రాసిన కామెంట్లు మీమ్స్ చూసి ఆధ్యా బాగా ఏడ్చిందని.. తీవ్ర నిరాశకు గురైందని.. ఆవేదనను వ్యక్తం చేసింది. నేను ఈ ఫోటోలు ఎలా క్రాప్ చేస్తానో.. ఎలా పోస్ట్ చేస్తాను అంటూ జోకులు వేస్తూ మీమ్స్‌ తయారు చేసి బయానకంగా వ్యవహరించే కఠినమైన వ్యక్తులు కూడా ఉన్నారని.. ఇలాంటి వారికి ఓ కుటుంబం ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంటూ ఫైర్ అయింది. నా ఆధ్యా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న సమయంలో ఒక మీమ్‌ పేజీ కనబడిందని.. అందులో తన తల్లిని ఎగతాళి చేయడం చూసి నా బిడ్డ తీవ్రంగా ఏడ్చింది అంటూ వాపోయింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసే వాళ్లకు కూడా ఒక కుటుంబం ఉంటుంది.

Pawan Kalyan's fan gets a sensational reply from Renu Desai on Akira and Aadya's blood - IBTimes India

అందులోనూ తల్లి, అక్క, చెల్లి ఇలా ఆడవారు ఉంటారని గుర్తుకు రాదా.. అంటూ ఫైర్ అయింది. మాపై అభ్యంతర మీమ్స్‌, జోక్స్ వేస్తున్న వారందరికీ నా శాపం తగులుతుంది. నా బిడ్డ ఈరోజు అనుభవించే వేదన, కార్చే కన్నీరు మీకు కచ్చితంగా బాధిస్తుంది గుర్తుంచుకోండి అంటూ ఫైర్ అయింది. అలాగే పవన్, లెజనోవా బిడ్డలు పోలేనా, మార్క్ కూడా ఈ మీమ్స్‌కు కఠినమైన కామెంట్లకు బాగా ప్రభావితం అవుతున్నారు. అతి భయంకరమైన మనుషులుగా తయారైన మీమ్స్‌ పేజీ అడ్మినిస్ట్రేటర్ లందరికీ.. కచ్చితంగా మా శాపాలు తగులుతాయి. నేను దీన్ని పోస్ట్ చేసే ముందు చాలాసార్లు ఆలోచించ. దాదాపు 100 సార్లు ఆలోచించిన తరువాత నా కూతురు బాధను చూసి ఇదంతా వ్యక్తం చేయాల్సి వచ్చింది అని రేణు దేశాయ్ తన ఇన్స్టా పోస్టులో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.