మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన కల్కి.. ఒక్క థియేటర్లో ఏకంగా అన్ని షోలా.. ఇది కదా ప్రభాస్ క్రేజ్..?!

ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరో రేర్ రికార్డును బ్రేక్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి పూర్తయి ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కల్కి బుకింగ్స్ ఓపెనై తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ సినిమా క్రేజ్ పిక్స్ కు చేరింది.

అలాగే తెలంగాణలోనూ ఎర్లీ మార్నింగ్ షోస్ తో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చాలా వరకు మల్టీప్లెక్స్ లో ఎక్కువ మొత్తంలో షోలను రన్ చేయనున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం ఓకే థియేటర్లో ఏకంగా 42 షోలు వెయ్యబోతున్నారంటూ సమాచారం. హైదరాబాద్‌లో కొత్తగా ఓపెన్ చేసిన అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్.. కేవలం కల్కి సినిమా కోసం ఓపెనింగ్ డేనే 42 షో లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ అన్ని విషయాలకు టికెట్లు పూర్తిగా అమ్ముడు పోవడం గమనార్హం.

Aparna Cinemas: A seven-screen luxurious multiplex launched in Hyderabad |  Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఇప్పటివరకు మరే స్టార్ హీరో సినిమా కూడా ఈ రేంజ్ లో మల్టీప్లెక్స్ లో షోలు పడడం.. అది కూడా టికెట్లు ఫుల్ గా ఆన్లైన్ లో బుక్ అయిపోవడం జరగనే లేదు. కేవలం ప్రభాస్‌కు మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో అమితాబ్, కమల్, రాజేంద్రప్రసాద్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ప్రబాస్ బ్రేక్ చేసిన ఈ రికార్డ్ నెటింట వైరల్ అవ్వడంతో.. ఇది ప్రభాస్ మానియా.. ఇది ప్రభాస్ రేంజ్ అంటూ తన అభిమానులు కామెంట్ల రూపంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.