వేణు స్వామి ఖాతాలో మరో స్టార్ హీరోయిన్ ..ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేక పూజలు ..ఎవరో గుర్తుపట్టారా..?

వేణు స్వామి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒక పాన్ ఇండియా హీరోకి ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉంటుందో అంతకు డబల్ స్థాయిలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలలో తనదైన స్టైల్ లో ఈ పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు . ఇప్పుడంటే వేణు స్వామి పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది కానీ మొదట్లో మాత్రం వేణు స్వామి ను ఓ రేంజ్ లో పొగిడేసారు జనాలు అభిమానులు .

మరీ ముఖ్యంగా సమంతా – నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు ఆయన పేరు ఏ స్థాయిలో హైలైట్ అయిందో చూసాం . ఆయన ను ఓ దేవుడిలా ట్రీట్ చేశారు.. ఆయన చెప్పింది తూచా తప్పకుండా జరుగుతుంది అని ఆయన కలియుగ దేవుడు అని ఓ రేంజ్ లో పొగిడేసారు . అయితే ఆ తర్వాత పలువురు స్టార్ సెలబ్రిటీస్ విషయాలలో ఆయన చెప్పిన జాతకం ఫ్యాన్స్ ని హర్ట్ చేయడంతో ఆయనపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . అలా అలా ఆయనపై హ్యూజ్ ట్రోలింగ్ జరగడం ప్రారంభమైంది .

రీసెంట్ కాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ ఫ్లాప్ అవ్వడం ఆయనకు బిగ్ నెగిటివ్గా మారింది . అయినా సరే వేణు స్వామిని నమ్మే జనాలు మాత్రం బాగానే ఉన్నారు. రీసెంట్గా వేణు స్వామి ను ఇంటికి పిలిపించుకొని మరి ఒక స్టార్ హీరోయిన్ పూజలు చేయించుకుందట . దానికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సీనియర్ హీరోయిన్ తన భర్త నుంచి త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఆ హీరోయిన్ వేణు స్వామిని ఇంటికి పిలిపించుకొని మరి ప్రత్యేక పూజలు చేయించుకుంటుందట . ఇప్పటికే ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఆ తర్వాత సీనియర్ పాత్రలో నటించింది భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతుందట. జాతకం దోష కారణంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కోబోతుందట . అందుకే పరిహార పూజలు వేణు స్వామి చేత చేయించుకోబోతుందట. దీనికి సంబంధించిన న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది..!!