ప్రభాస్, బన్నీ , తారక్ పేరుకే పాన్ ఇండియన్ హీరోలు.. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు..?!

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంత పెద్ద నటీనటులైనా కూడా కచ్చితంగా వారికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఏదో సందర్భంలో బయటపడుతుంది. అలాగే మన టాలీవుడ్ లోనూ చాలా మంది స్టార్ హీరోస్ ఏదో ఒక విషయంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అలా అల్లు అర్జున్, తారక్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు కూడా కొన్ని వీక్నెస్ లు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. పేరుకే పాన్ ఇండియన్ హీరోస్ అయినా.. వీరి వీక్నెస్ లు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ ఈ పాన్ ఇండియన్ హీరోలలో ఎవరికి ఎలాంటి వీక్నెస్ ఉందో ఒకసారి చూద్దాం.

Prabhas English Speaking Skills

ప్రభాస్ :
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ప్రేక్షకుల ముందుకు రానంది. ప్రపంచమవ్యాప్తంగా తెలుగు సినీ అవ‌ర్స్‌ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంత పెద్ద స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్.. ఇప్ప‌టికి కూడా జనాలు ఎక్కువగా ఉంటే షూటింగ్లో డైలాగ్స్ గట్టిగా చెప్పలేడ‌ట. మైక్ ఇస్తే అసలు మాట్లాడను కూడా మాట్లాడలేడ‌ట. ప్రభాస్‌కు స్టేజ్ ఫియర్ చాలానే ఉందని టాక్. మొదటినుంచి ఇంటర్వెర్ట్‌గా ఉండే ప్రభాస్.. ఛ‌త్రపతి సినిమా నుంచి.. నలుగురిలో ఎలాగో డైలాగ్స్ చెప్పడం కాస్త తెగించి మొదలు పెట్టారట. అందుకే ఆయన షూటింగ్ జరుగుతున్న టైంలో వీలైనంతవరకు అక్కడ తక్కువ మంది జనాభా ఉండేలా దర్శకులు చూసుకుంటారని తెలుస్తుంది.

What do you say about 'Allu Arjun is the best dancer in the telugu film  industry'? - Quora

అల్లు అర్జున్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ డ్యాన్సర్ గా, బెస్ట్ యాక్టర్ గా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చివరిగా రిలీజ్ అయిన పుష్ప తో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును దక్కించుకొని రికార్డ్ సృష్టించాడు. ఇక ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే త‌న డ్యాన్స్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఎంత కష్టమైనా స్టెప్ నైనా ఇట్టే కెమెరా ముందు వేసేయగలడట. అయితే ఒకేసారి పది స్టెప్పులు వేయమని అల్లు అర్జున్‌కు చెబితే మాత్రం త‌న వ‌ల్ల కాద‌ట‌. ఓ నాలుగు నిమిషాల సాంగ్ మొత్తానికి కంటిన్యూగా అల్లు అర్జున్ డ్యాన్స్ చేయమంటే ఎంత ప్రాక్టీస్ ఉన్నా కూడా తన వల్ల కాదని స్వయంగా ఆయనే ఇంటర్వ్యూలో వివరించాడు.

Temper Best Scenes | Five Best Scenes of Temper | Temper Movie Highlights |  Temper Movie Scenes | Temper Movie Best Scenes | Top Scenes Of Temper|  Temper High Lights | Temper |

జూనియర్ ఎన్టీఆర్ :
ఎంత కష్టమైనా పాత్రలోనైనా , ఎలాంటి యాక్షన్స్ సన్నివేశాల్లోనైనా పరకాయ ప్రవేశం చేసి మరి నటించే ఎన్టీఆర్.. ఎంతో కష్టతరమైన డ్యాన్స్ స్టెప్‌లు కూడా ఇర‌గ‌దీస్తాడ‌న సంగ‌తి తెలిసిందే. అలాంటి ఎన్టీఆర్ కూడా న‌ట‌న ప‌రంగా రొమాంటిక్ సన్నివేశాలు చేయ‌టంలో చాలా వీక్ అట‌. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు చేయ‌టానికి చాలా ఇబ్బందిగా, కష్టంగా భావిస్తాడట. అందుకే తారక్ తన సినిమాలో వీలైనంత తక్కువ రొమాన్స్ ఉండేలా చూసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.