ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరి కొద్ది గంటల్లో సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా కల్కి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఓ యంగ్ హీరోయిన్ ప్రభాస్ కు తల్లి గా నటించింది అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇలాంటి క్రమంలో ప్రభాస్‌కు తల్లి పాత్రలో అమ్మడు నటించింది అని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదు మృనాల్ ఠాగూర్. సీతారామమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో అచ్చ తెలుగు ఆడపడుచు అనే ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. హయ్ నాన్న సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తన సినిమాల్లో ట్రెడిషనల్ లుక్కుతో ఆకట్టుకునే ఈ అమ్మడు సోషల్ మీడియాలోని యాక్టివ్‌గా ఉంటూ హాట్ అందాలతో కుర్రకారును కవస్తూ ఉంటుంది. ఇక చివరిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరస సినిమా ఆఫర్లను దక్కించుకుంటుంది.
అలా కల్కి లోను అమ్మడు ఓ కీలక పాత్రలో నటించింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మృనాల్ ఈ కల్కి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ చిన్నతనంలో ఉన్న టైంలో ప్రభాస్ కి తల్లి పాత్రలో మృణాల్ నటించింది అంటూ సమాచారం. అయితే ఇందులో అసలు నిజంగానే మృణాల్ పాత్ర ఉందా..? లేదా..? ఉంటే అది ప్రభాస్ తల్లి పాత్రనా..? అనే దానిపై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కేవలం టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుంచి మాత్రమే ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.