తలకిందులుగా తపస్సు చేసిన ఆ భాషలో “కల్కి” సినిమాని హిట్ చేయడం ఆ దేవుడి తరం కూడా కాదా..? ఎందుకంటే..?

కల్కి .. సినిమా గురించి ఎంత పాజిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయో.. అంతే నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కల్కి సినిమాపై పలువురు బడా స్టార్స్ కూడా హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి . ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు ప్రభాస్. దీపికా పదుకొనే – దిశ పటానికి హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమాలో అమితాబచ్చన్ – కమల్ హాసన్ కీలకపాత్రలో కనిపించారు .

మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు రెబల్ అభిమానులు . తెలుగులో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది .. నో డౌట్.. అయితే మిగతా భాషలలో పరిస్థితి ఏంటి ..? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది . అయితే ఏ భాషలో ఈ సినిమా హిట్ అయిన తమిళ్లో మాత్రం హిట్ అవ్వదు అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు తమిళ్ జనాలు.

కేవలం ఈ సినిమానే కాదు ఏదైనా సరే బిగ్ బడా పాన్ ఇండియా మూవీ తెలుగు హీరో నటిస్తున్నాడు అంటే ఆ సినిమాని తమిళ్లో ఫ్లాప్ చేయడానికి చూస్తారు కొందరు తమిళ్ జనాలు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు . దాని వెనక తమిళ హీరోల హస్తం కూడా ఉంటుంది అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ బాహుబలి సినిమాలు కూడా తమిళనాడులో బాగా ట్రోలింగ్కి గురయ్యాయి . ఇప్పుడు కల్కి సినిమా విషయంలోనూ అదే జరగబోతుంది అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!