రష్మిక కి కొత్త తలనొప్పులు స్టార్ట్.. ఈ నేషనల్ క్రష్ టైం దగ్గరపడ్డిందా..?

పండ్లున్న ..చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత మనం వింటూనే ఉంటాం . అది నిజమే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో .. వాళ్ళ పైన రూమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఆ రూమర్స్ మంచి చేస్తాయి ..మరికొన్నిసార్లు ఆ రూమర్స్ బ్యాడ్ చేస్తాయి . ప్రెసెంట్ రష్మిక మందన్నా పై వచ్చే రూమర్స్ ఆమెకు తీవ్ర తలనొప్పులు క్రియేట్ చేస్తున్నాయి . దానికి కారణం ఆమె క్రేజ్..

రష్మిక క్రేజ్ పెరిగిపోవడంతో రకరకాల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . రష్మిక మందన్నా.. ఏ సినిమాలో నటిస్తుంది..? ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..? ఏ విధంగా కండిషన్స్ పెడుతుంది..? అనే విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా.. సల్మాన్ ఖాన్ సినిమా కోసం ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపించాయి .

దీంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది . ఇప్పుడు మేకర్స్ రష్మికకు ఆఫర్ ఇవ్వాలి అంటేనే భయపడిపోతున్నారు . ఒక్కొక్క సినిమాకి 15 కోట్లా..? మేము ఆమె రేంజ్కి తూగలేమంటూ ఆమె వద్దకు వెళ్లకుండానే ఆఫర్లు రిజెక్ట్ చేసేసి ఆ ఆఫర్ ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు . దీంతో రష్మిక ఖాతాలోకి వచ్చినట్లే వచ్చి పెద్ద పెద్ద ఆఫర్స్ చేజారి పోతున్నాయి . రష్మిక క్రేజ్ ఆమెకు బిగ్ నెగిటివ్ గా మారింది అంటున్నారు అభిమానులు..!!