ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ అభిమానులు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు .. బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే.. కెరియర్ సగంలో ఎలా బ్లాస్టింగ్ రేంజ్ లో డిజాస్టర్ గా మారిందో మనం చూసాం .. కెరియర్ పిక్స్ లో వెళ్తూ ఉండగానే ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పూజా కెరీర్ డమాల్ అంటూ పడిపోయింది . బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలను అందుకోవడం.. అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవడం ..పూజా కెరీర్ కు మైనస్ గా మారింది .
ఇప్పుడిప్పుడే పూజా మళ్ళీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది . కాగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం అందుకుంది పూజ హెగ్డే . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాతో కోలీవుడ్లో పూజా ఈజ్ బ్యాక్ అనిపించుకునేలా మారబోతుంది . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య నటించబోతున్న నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది పూజ హెగ్డే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రెసెంట్ నాగ చైతన్య తండేల్ మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు . నాగచైతన్య ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే విరూపాక్ష డైరెక్టర్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ను చూస్ చేసుకున్నారట . దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. కోలీవుడ్ లో సూర్య టాలీవుడ్ లో నాగచైతన్య పూజకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . చూద్దాం మరి ఈ రెండు సినిమాల ఆమెకు ఎలాంటి పాజిటివ్ వైబ్స్ అందిస్తాయో..??