సమంత -రష్మిక- శ్రీ లీల ఈ ముగ్గురు ఫేవరెట్ హీరో ఒకరే.. ఎవరో తెలుసా..?

ఒక్కొక్కరికి .. ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటారు ..ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఒకే హీరో ఫేవరెట్ గా మారాలి అని లేదు.. మరీ ముఖ్యంగా స్టార్స్ కి అయితే అసలు అలాంటి మ్యాచ్ లు కలవవు.. అయితే అలా కలిసిందా వాళ్లు నిజంగా రేర్ టేస్ట్ అనే చెప్పాలి. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో వైరల్ గా మారింది . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండదు .

సమంత – రష్మిక మందన్నా- శ్రీ లీలలకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . సమంత ఏ హీరోనైతే తన ఫేవరెట్ హీరోగా భావిస్తుందో అదే హీరోని రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో నా ఫేవరెట్ హీరో కూడా అంటూ చెప్పుకు వచ్చింది . ఆశ్చర్యమేంటంటే అదే హీరో పేరును శ్రీ లీలా కూడా తన ఫేవరెట్ హీరో అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం గమనార్హం . దీంతో ముగ్గురు హీరోయిన్స్ ఒకే హీరోను ఇష్టపడుతున్నారు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

అది కూడా మన తెలుగు హీరో కావడం మరింత స్థాయిలో ఈ వార్త ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ఆ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఒకానొక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ ..”నా ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చింది.. ఫేవరెట్ హీరో కూడా ఆయనే” అంటూ క్లారిటీ ఇచ్చింది .. ఆ తర్వాత రష్మిక మందన్నా .. శ్రీలిల్లా కూడా పలు సందర్భాలలో ఇంటర్వ్యూలలో బన్నీ ఫేవరెట్ హీరో అంటూ చెప్పుకు వచ్చింది. దీంతో ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు బన్నీ అభిమానులు..!!