ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . కొద్ది గంటలే కేవలం కొద్ది గంటలు ..అంటే కొద్ది గంటలే .. మిగిలి ఉంది .. అయితే కల్కి సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో కల్కి సినిమాపై భారీగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది . కావాలనే కొందరు ఆకతాయిలు ఈ విధంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు . ఇప్పటివరకు సినిమాకి సంబంధించిన షోనే పడలేదు. అయితే అప్పుడే కల్కి సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఇవే అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .
ప్రభాస్ లాంటి హీరోను కామెడీ యాంగిల్ లో చూపించి నాగ్ అశ్వీన్ తప్పు చేశాడు అని కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన సినిమా కాన్సెప్ట్ ఆయనకైనా అర్థమైందా ..?అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . మధ్యలో బుజ్జి అంటూ హాలీవుడ్ స్టైల్ లో మెప్పించే విధంగా నాగ్ అశ్వీన్ చేసిన సాహసాని కూడా తప్పు పడుతున్నారు.
అంతేకాదు నాగ్ అశ్వీన్ రాజమౌళిని ఎప్పటికీ టచ్ చేయలేడు అని.. అలాంటి ఆశలు ఉంటే నాగ్ అశ్వీన్ మానుకోవాలి అని సినిమాకి అంత సీన్ లేదు అంటూ నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. దీనిపట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. అసలు సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూ ఎలా ఇస్తారు ..? ఎలా నెగటివ్ కామెంట్స్ చేస్తారు ..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో ప్రభాస్ సినిమాకి అప్పుడే భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది..!!