ప్రభాస్ రికార్డుల వేట.. అప్పుడే మొదలైపోయింది . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి . కేవలం మరికొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించి ఏ ఇంట్లో చూసినా కూడా ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . కొంతమంది స్కూల్ కి డుమ్మా కొట్టి మరికొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సిక్ లీవ్స్ పెట్టి మరి కల్కి సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .
కాగా ఇలాంటి క్రమంలోనే రెబల్ ఫ్యాన్స్ అయితే సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగైనా క్రేజీ క్రేజీ రికార్డ్స్ బద్దలు కొడుతుంది.. అది అందరికి తెలిసిందే సినిమా రిలీజ్ అవ్వక ముందే రికార్డ్స్ ల వేట కొనసాగించాడు ప్రభాస్ . పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన మూవీ కల్కి కనీ విని ఎరుగని సంచలన రికార్డు నెలకొల్పింది. నాగ్ అశ్వీన్ ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు .
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది . అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు అమితాబ్ బచ్చన్ – కమల్ హాసన్. కాగా ఈ సినిమా యూఎస్ లో అప్పుడే నాలుగు మిలియన్ల డాలర్ల మార్ క్ ను దాటేసింది . అక్కడ 500 లొకేషన్స్ లోనూ 3000 షోలకు గాను ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు లక్షల పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు నాగ్ అశ్వీన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ అమెరికాలో బీభత్సమైన స్పందన లభిస్తుంది. రిలీజ్ కి ముందు నాలుగు మిలియన్ల డాలర్ల మార్క్ ను దాటేసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు ఇండియన్ ఫిలిం గా ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కి ముందే సంచలన రికార్డు నెలకొల్పింది..!!