“కల్కి” సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ తర్వాత ..అందరికీ నచ్చే పాత్ర అదే.. అందుకే నాగీ అంత ఇంట్రెస్ట్ చూయిస్తున్నాడా..?

నాగ్ అశ్వీన్ సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా స్టార్ గా మారిపోయిన డైరెక్టర్ . నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన సినిమాలు చాలా చాలా తక్కువ . అయితే తెరకెక్కించిన ప్రతి సినిమాను తనదైన స్టైల్ లో హిట్ గామలుచుకున్నాడు ..హిట్ ట్రాక్ ఎక్కేలా చేశాడు ..డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ఆయన తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు సినీ చరిత్రలో ఎవ్వరూ చేయని బిగ్ సాహసం చేశాడు నాగ్ అశ్వీన్. కల్కి అంటూ ఒక సపరేట్ డిఫరెంట్ థీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించారు .

మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది . ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ లు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . అయితే ఈ సినిమాలో భైరవ పాత్రలో కనిపించిన ప్రభాస్ క్యారెక్టర్ సినిమాకి ఎంత హైలెట్గా మారుతుందో ఆ తర్వాత సుమతి పాత్రలో కనిపించిన దీపికా పదుకొనే క్యారెక్టర్ కూడా అంతే హైలెట్ గా మారబోతుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. సినిమాలో బడాబడా స్టార్స్ కమల్ హాసన్ – విజయ్ దేవరకొండ – అమితాబచ్చన్ – దిశా పటాని ఇలాంటి స్టార్స్ ఉన్నప్పటికీ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ..

అసలు కల్కి సినిమాకు బీజం పడిందే దీపికా క్యారెక్టర్ వల్ల అని ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత హైలెట్గా మారిపోతుందో బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే క్యారెక్టర్ కూడా అంతే హైలెట్ గా మారిపోతుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ ఒరిజినల్ టాక్ బయటకు వచ్చేస్తుంది..!