ఆ పొలిటికల్ లీడర్ ను పెళ్లి చేసుకోనున్న శ్రీ రెడ్డి .. షాక్ లో నేటిజన్స్..?!

బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈమె ముఖ్యంగా మీ టూ ఉద్యమం టైంలో ఈమె పేరు సంచలనంగా మారింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని బోలెడుగా పోస్టులు పెడుతూ అందరికీ షాక్ ఇచ్చింది. మొదట రెండు మూడు సినిమాల్లో కనిపించిన శ్రీరెడ్డి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయినా సోషల్ మీడియాలో ఈమె చేస్తే పోస్టుల ద్వారా భారీ పాపులారిటి దక్కించుకుంది. ముఖ్యంగా రానా తమ్ముడు అభిరామ్‌ను ప్రేమించానని.. అతను నన్ను మోసం చేశాడంటూ ఇండస్ట్రీలో పెద్ద ర‌చ్చే చేసింది.

Sri Reddy - Wikidata

కానీ అభిరామ్ కు ఇటీవల మరో అమ్మాయితో వివాహం కావడంతో సైలెంట్ అయిపోయిన శ్రీ రెడ్డి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసిన నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని పోస్టుల వల్ల ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉండే ఈ అమ్మడు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరెడ్డి పెళ్లికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. వైసీపీకి సపోర్ట్ చేస్తూ వారికి అండగా మాట్లాడే శ్రీ రెడ్డి తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ యువ నాయకుడిని వివాహం చేసుకోబోతుందంటూ పుకార్లు నెట్టింట జోరు అందుకున్నాయి.

Sri Reddy Comments On Byreddy Siddharth Reddy | బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  కి శ్రీరెడ్డి లవ్ ప్రపోసల్

దానికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఒక పొలిటీష‌న్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్ట‌గా దానికి ఆమె ఆ వైసీపీ యంగ్ పొలిటిషన్ పేరు పెట్టి మరి అతనికి తెలిస్తే నీ చెయ్యి తీసేస్తాడు అంటూ కామెంట్ చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు నెటింట వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ నాయకుడు మరెవరో కాదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇతనితో శ్రీరెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందట. ప్రస్తుతం శ్రీరెడ్డి పెళ్లి వార్త నెటింట తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవడంతో నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇదంతా ఫేక్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.