ఒకప్పుడు 30 కోట్లు..ఇప్పుడు 10 కోట్లు.. ఢమాల్ అంటూ క్రేజ్ పడిపోయిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేము. అది అందరికీ తెలిసిందే. మరొకసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో . మొన్న మొన్నటి వరకు ఈ హీరో చెప్తే అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు . అంతేనా మేకర్స్ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి ఆయనతో సినిమాలను తెరకెక్కించేవారు . సీన్ కట్ చేస్తే మార్కెట్లో ఆయన క్రేజ్ పడిపోవడంతో ఆయన రేంజ్ కూడా పడిపోయింది .

ఒకప్పుడు 30 కోట్లు తీసుకునే ఈ హీరో ఇప్పుడు కేవలం 10 కోట్లే ఛార్జ్ చేస్తున్నాడు. అది ఇవ్వడానికి కూడా మేకర్స్ చాలా ఆలోచిస్తున్నారు అంటే ఆయన పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన మరెవరో కాదు టైగర్ ష్రాఫ్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో . అమ్మాయిలు ఈయన అంటే ఎలా పడి చచ్చిపోతూ ఉంటారో అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు .

కాగా షర్ట్ లేకుండా కండలను ఎక్స్పోజ్ చేసే టైగర్ ష్రాఫ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకోవడం అదేవిధంగా కొత్త హీరోస్ సూపర్ డూపర్ హిట్స్ అందుకోవడం ఆయన కెరీర్ కు బాగా మైనస్ గా మారింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాప్ తన రెమ్యూనరేషన్ ని 30 కోట్ల నుంచి 10 కోట్లకు తగ్గించేశాడు. ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అనేది అంటూ ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేస్తుంది బాలీవుడ్ మీడియా..!!