“నా వల్లే అనుష్క హీరోయిన్ అయ్యింది”..నటుడు సెన్సేషనల్ కామెంట్స్..!

అనుష్క శెట్టి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఒకటి రెండు సినిమాల్లో నటించిన తర్వాతే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చి నెగిటివిటీని పేస్ చేశారు . కానీ అనుష్క మాత్రం నెగిటివిటీని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంది . టాలీవుడ్ జేజమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క శెట్టి అందరి చేత శభాస్ అని అనిపించుకుంది .

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఆమె ఆఖరిగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాతో ఆమె మళ్లీ తన పునర్ వైభవం అందుకుంది . మంచి మంచి సినిమాలలో అవకాశాలు వస్తున్నా సరే ఎందుకో ఆమె ఆఫర్స్ రిజెక్ట్ చేస్తుంది . అనుష్క హీరోయిన్ అవ్వడానికి కారణం నేనే అంటూ ఓ నటుడు ఇంటర్వ్యూలో చెప్పడం హైలైట్ గా మారింది . ఆయన మరెవరో కాదు సోనూ సూద్.

“అనుష్క నేను ముంబైలో ఓకే జిం లో వర్క్ అవుట్స్ చేసేవాళ్లము. అప్పటికే నేను ఇండస్ట్రీలో ఉన్నాను.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఫ్రెండ్షిప్ కూడా ఉంది . హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధూమ్ సినిమాకు ఇంచుమించు అదే విధంగా ఉండే సినిమాను తెలుగులో తెరకెక్కించబోతున్నామంటూ చెప్పారు . అప్పుడే నన్ను నాగార్జున సెలెక్ట్ చేశారు . హీరోయిన్ కోసం కొత్త ఆర్టిస్ట్ కావాలి అంటూ చూస్తున్నామని చెప్పారు . అనుష్క గురించి నేనే చెప్పాను ..నిజానికి నేను అప్పటివరకు అనుష్కతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. జిమ్ లో కనిపిస్తే స్మైల్ ఇచ్చేది. ఆ పాత్రకు తన సూట్ అవుతుంది అని నాకు అనిపించింది . అందుకే జిమ్ ట్రైనర్ నుంచి ఆమె నెంబర్ తీసుకొని మరి పూరి జగన్నాథ్ గారికి చెప్పాను . ఆ తర్వాత ఆమె సినిమాలో సెలెక్ట్ అయింది ..సూపర్ గా నటించింది నన్ను మించిన పెద్ద స్టార్ అయిపోయింది “అంటూ చెప్పుకొచ్చాడు సోను సూద్..!!