దీపిక పదుకొనే టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్ మాత్రం అసలు కాదు..?!

టాలీవుడ్ ప్రేక్షకులకు బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి ఇమేజ్‌ ఏర్పరచుకుంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాల్లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కల్కి 2898 ఏడీ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న అమ్మడు.. ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా కల్కి ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్‌లో దీపిక త‌న టాలీవుడ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో రివీల్ చేసింది. ఈ క్ర‌మంలో అమ్మ‌డి కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. చదువు మధ్యలోనే ఆపేసి మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నాను అని చెప్పిన దిపికా.. త‌న‌ అమ్మ,నాన్నను ఈ విష‌యంపై ఎంతోమంది విమర్శించిన.. వాళ్ళు దీపిక‌ను ఒక్క మాట కూడా ఎప్పుడూ అనలేదంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకు లాంగ్ డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేశానని దీపిక వివ‌రించింది. ఆ తరువాత ఐశ్వర్య సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చానని.. అది తెలుగు హిట్ మూవీ మన్మధుడు రీమేక్ అంటూ చెప్పుకొచ్చింది.

Pin by Swarnima on Deepika Padukone | Indian film actress, Popular  actresses, Rana daggubati

టాలీవుడ్ లో సోనాలి బింద్రే ప్లే చేసిన రోల్‌.. నేను ఐశ్వర్యలో నటించా అని.. ఈ సినిమా తర్వాత నేను నటించిన ఫస్ట్ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ఓం శాంతి ఓం అంటూ వివ‌రించింది. ఇక ఈ సినిమా అమ్మడి కెరీర్‌ను భారీ మలుపు తిప్పింది. మొదటి స్ట్రైట్ మూవీతోనే భారీ సక్సెస్ అందుకోవడంతో దీపికకు వ‌రుస‌ అవకాశాలు క్యూ కట్టాయి. ఇలా స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ హీరో ఎవరు అనే అంశం నెటింట ఆశ‌క్తిగా మారింది. తాజాగా ఈమె తన ఫేవరెట్ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అంటూ వివరించింది. మహేష్ బాబు తో పాటు త‌నకు రానా అంటే కూడా ఇష్టమట. అయితే మొదటి నుంచి దీపికాకు రానా క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి చాలా మందికి తెలియదు.