టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్త్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అంత భారీ బడ్జెట్ మూవీ కి హైప్ పెంచేందుకు ఈమాత్రం ప్రమోషన్స్ సరిపోతాయా..? మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. కాబట్టి ఎలాగొల గట్టెక్కుతుంది అనుకోవచ్చు. మరి ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కల్కి ప్రమోషన్స్ ఇలానే ఉంటే బయటపడుతుందా..? అనే సందేహం నెటింట హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసిన ప్రస్తుతం కల్కి.. కల్కి.. ఈ మాటే వినిపిస్తుంది.
అయితే బాక్సాఫీస్‌కు సరైన సక్సెస్ అంది చాలా కాలమైంది. ఏడది మొదట్లో సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్, గుంటూరు కారం సక్సెస్ తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ఆ రేంజ్ లో ఒక్క సరైన సక్సెస్ కూడా అందలేదు. మధ్యలో టిల్లు స్క్వేర్ ఒకటి అంతంత మాత్రమే సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కల్కి తో మరోసారి థియేటర్స్ కళకళలాడనున్నాయి. వారం ముందు నుంచే కల్కి మొదలైపోయింది. అయితే ఇంత పెద్ద సినిమాకు తక్కువ ప్రమోషన్స్ ఏమాత్రం సరిపోతాయి..? ఇటీవల కాలంలో ఆర్ఎఫ్సిలో స్పెషల్ ఈవెంట్.. కొద్ది రోజుల క్రితం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. నిన్నటీ టీం కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్.. ఈ మాత్రం ప్రమోషన్స్ కల్కి కి సరిపోతాయా..?
సాధారణంగా రూ.600 కోట్ల బడ్జెట్లో పాన్ ఇండియన్ మూవీ వస్తుందంటే ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉండాలి..? ట్రిపుల్ ఆర్, బాహుబలి సమయంలో రాజమౌళి దేశమంతా తిప్పి మరి ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ కల్కి విషయంలో మాత్రం అవేవీ జరగడం లేదు. మేకింగ్ వీడియోలు.. రన్నింగ్ ఇంటర్వ్యూలతోనే నాగ్ అశంవిన్ సినీ ప్రమోషన్స్ ను పూర్తి చేసేశాడు. తెలుగులో అంటే ఓకే ఎలాగోలా గట్టెకుతారు. మరి బయట ఉన్న తమిళనాడు , కేరళ, ముంబై లకు ఈ ప్రమోషన్స్ సరిపోతాయా అంటే సందేహమే.. అక్కడ కల్కీ బుకింగ్ ఊహించిన రేంజ్ లో లేకపోవడానికి కేవలం ప్రమోషన్స్ ఏ కారణమని సినీ విశ్లేషకులు అంతా భావిస్తున్నారు. మరి రేపు రిలీజ్ తర్వాత అయినా ఆ పరిస్థితి నుంచి కల్కి భయటపడుతుందో లేదో వేచి చూడాలి.