సైబర్ మోసగాళ్ల వలలో టాలీవుడ్ బ్యూటీ.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ఇటీవ‌ల కాలంలో ఎక్క‌డ చూసినా సైబర్ మోసాలు ఎక్కువగా జ‌రుగుతున్న‌ సంగతి తెలిసింది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల సైబర్ మోసాల వల్ల డబ్బులను న‌ష్ట‌పోవడమే కాదు వాటి వల్ల క‌లిగిన స‌మ‌స్య‌ల‌తో ప్రాణాలను కూడా కోల్పోయిన సంఘ‌ట‌న‌ట‌ను చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నా.. కొంతమంది వారి వల్ల‌లో చిక్కుకుపోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌ను టార్గెట్ చేశారు సైబర్ మోసగాళ్లు. అయితే ఆమె వారి నుంచి చాలా తెలివిగా బయటపడింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు.. ఆమె సైబర్ నెరగాళ‌ నుంచి ఎలా తప్పుకుందో ఒకసారి చూద్దాం. తెలుగు సినిమా పరిశ్రమలో ప‌లు నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది నటి అనన్య నాగళ్ళ.

కాగా తాజాగా ఆన‌న్య‌ సైబర్ నేరగాళ్ల వల్లలో చిక్కింది. ఈమెకు జరిగిన ఈ సంఘటన గురించి స్వయంగా ఆమె షేర్ చేసుకుంది. తనకి ఓ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని.. తన ఐడితో ఉన్న ఓ సిమ్ కార్డ్ నుంచి అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని.. దీంతో ఆమె సిమ్ కార్డును మేము బ్లాక్ చేస్తున్నామంటూ హెచ్చరించారని చెప్పుకొచ్చింది. ఒకవేళ అలా కాకుంటే మాత్రం ఆమె పోలీస్ క్లియరెన్స్ తెచ్చుకోవాలని వారు వివరించారని.. అయితే ఆ టైంలో వాళ్లు పోలీసులకు కాల్ చేస్తున్నట్లుగా ఆమెను కన్ఫ్యూజ్ చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాదు. పోలీస్ క్లియరెన్స్ కోసం ఆవిడను ముంబై రావాలని చెప్పారని.. వీడియో కాల్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటూ ఆమె ఆధార్ నెంబర్‌ని కూడా తీసుకున్నారని చెప్పుకొచ్చింది.

Ananya Nagalla: హీరోయిన్ అనన్య నాగళ్ళకి చేదు అనుభవం! కెమెరా ముందుకి వచ్చి  అసలు నిజాలు!

ఇక ఈ నెంబర్‌తో 25 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని.. ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి ఓ వ్యక్తికి డబ్బులు పంపాలని.. దాంతో ఆర్బిఐ మిగతా సంగతి చూసుకుంటుందని వివరించారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సంఘటనపై అనుమానం వచ్చిన అనన్య.. అది ఫ్రాడ్ కాలని గుర్తించి వెంటనే నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నాను అని చెప్పడంతో.. అవతల వ్యక్తి కాల్ కట్ చేశాడట‌. అలా నేను సైబర్ నేరగాళ‌ నుంచి తప్పించుకున్నాను అంటూ అన‌న్య చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. కనుక ఎలాంటి బెదిరింపు కాలుసుకు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ అధ‌ఙ‌కారులు చెప్తున్నారు.