‘ కల్కి ‘ మూవీ పై అక్క‌డ హైప్ పెంచేసిన కన్నడ సూపర్ స్టార్.. బుజ్జిని నడిపిన రిషబ్ శెట్టి(వీడియో).. ?!

పాన్ వరల్డ్ లెవెల్ లో సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా మైథాలజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్‌ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్, కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిశా పటాని, దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక కల్కి టీమ్ అంతా ప్రత్యేక ఆసక్తి చూపి మరి ప్రమోషన్స్ తో హైలెట్ చేసిన బుజ్జి దా రోబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Rishab Shetty takes Kalki 2898 AD's Bujji for a spin | Times Now

ఈ రోబో క్యారెక్టర్ కు టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కొంతకాలం నుంచి ఈ బుజ్జి రోబో కారును ప్రమోషన్స్ కోసం తెగ వాడేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పలువురు స్టార్ హీరోస్ ఈ బుజ్జి రోబో కార్ లో డ్రైవ్ చేసి.. మ‌రీ వారి ఎక్స్పీరియన్స్ గురించి వివరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో కన్నడ స్టార్ కాంతారా ఫేమ్ రిష‌బ్‌ శెట్టి కూడా చేరిపోయాడు.

Rishabh Shetty Drives Futuristic Car Bujji from 'Kalki 2898 AD' | Rishabh Shetty Drives Futuristic Car Bujji from 'Kalki 2898 AD'

ఆయన బుజ్జిని డ్రైవ్ చేస్తున్న వీడియోను కల్కి టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట‌ తెగ వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం రిష‌బ్‌ కాంతారా 2 సినిమాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రైటర్ గా, డైరెక్టర్ గా తానే బాధ్యతలు స్వీకరించిన రిషబ్ శెట్టి ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరిచాడు.