ఒక మనిషి బాగుపడుతున్నాడు అన్న.. ఆ మనిషి పైకి ఎదుగుతున్నాడు అన్న.. పక్కనుంచి ఏడవడానికి ఆయనను దిగజార్చడానికి ఎప్పుడు నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. చాలామంది అలా చేస్తూ ఉంటారు మనం చుట్టుపక్కల అలాంటివి బాగా గమనించొచ్చు . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా అదే విధంగా అదే విధమైనటువంటి జనాలు ఉన్నారు అనే రేంజ్ లో ప్రచారం జరుగుతుంది . రీసెంట్గా కల్కి సినిమా విషయంలోనూ అలాగే జరుగుతుంది అంటున్నారు రెబల్ అభిమానులు.
నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి మరికొద్ది గంటలోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం ఎలాంటి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారో కల్కి టీం మనం చూస్తున్నాము. చాలామంది స్టార్స్ కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నామంటూ ట్వీట్స్ సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతున్నారు . అయితే తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో మాత్రం కల్కి సినిమా గురించి పట్టిపట్టనట్టు ఉండడం గమనార్హం .
అసలు ఎందుకు ఈ హీరో ప్రభాస్ కల్కి సినిమాను ప్రమోట్ చేయడం లేదు అని ఆరా తీస్తే మాత్రం గతంలో ఓ సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లాషెస్ కారణమంటూ తెలుస్తుంది. అప్పుడెప్పుడో పదేళ్ల ముందు వచ్చిన గొడవలను మనసులో పెట్టుకొని ప్రభాస్ తో మాట్లాడకుండా ఇప్పుడు కల్కి సినిమా టైంలో దెబ్బ కొడుతున్నాడు అంటూ రెబెల్ ఫాన్స్ మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ బోడి గాడు సపోర్ట్ చేయకపోతే కల్కి సినిమా హిట్ అవ్వదా..? ఏంటి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!