పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్‌తో కలిసి పలు సినిమాల్లో కలిసి నటించిన ఈ అమ్మడు.. ఈ క్రమంలో అతనిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఆఖీరా నందన్, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఏవో కారణాలతో కొంత కాలం క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కు విడాకులు ఇచ్చిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల భాద్యత తానే చూసుకుంటూ వచ్చింది. రేణు దేశాయ్ తన పని తాను చూసుకుంటున్న.. పవర్ స్టార్ ప్రస్తావన వచ్చినప్పుడు లేదా అఖీరా, అధ్య ప్రస్తావన వచ్చినప్పుడు రేణు దేశాయ్ పేరును కూడా ప్రస్తావిస్తూ వార్తలు వైరల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపద్యంలో తాజాగా ఆఖీరాని తక్కువ చేసి మాట్లాడినందుకు రేణు దేశాయ్ నెటిజన్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆఖీరా కూడా హీరో అయితే బాగుంటుందని అభిమానులు ఇప్పటికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. అఖీరాకు యాక్టింగ్ అసలు ఇష్టం లేదని.. తనకు ఇష్టమైన పనిచేయడానికి ఆఖీరాకు నేను ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను అంటూ రెణు దేశాయ్ వివరించిన సంగతి తెలిసిందే. అయినా అభిమానులు మాత్రం ఆఖీరని వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. ఆఖీరా లిటిల్ పవర్ స్టార్ అనే కామెంట్స్ మాత్రం మానడం లేదు. అయితే ఈసారి మాత్రం అలాంటి కామెంట్స్ కి భిన్నంగా ఓ నెటిజన్ ఆఖీరాని తక్కువగా చేసి మాట్లాడాడు. వాడి మొహం యాక్టర్ అయ్యేలా ఉందా అంటూ నెగిటివ్ కామెంట్ చేశాడు. దీంతో రేణు దేశాయ్ అతనిపై ఫైర్ అయింది.
ఇలాగే మీ అమ్మ , నాన్న నిన్ను పెంచింది. కెరీర్ ప్రారంభించక ముందే ఓ అబ్బాయి గురించి ఇలాంటి తప్పుడు వాగుడు.. ఇప్పుడిప్పుడే జీవితం ప్రారంభిస్తున్న ఓ కుర్రాడి గురించి ఇలా మాట్లాడడం అసలు సరైనదేనా.. నీ అర్హత ఏంటి అనేదాన్ని ఒకసారి తెలుసుకో.. ఒకవేళ తన మొహాన్ని చూపించే అంత అర్హత తనకు లేకపోతే నువ్వు చూడకపోవడం మంచిది. సిగ్గులేకుండా నన్ను ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ.. నా కొడుకు గురించి నాతోనే ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తున్నావా..? నీలాంటి వాళ్ళని చూస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారు అని అసహ్యం వేస్తుంది అంటూ ఫైర్ అయింది. నాకు కామెంట్స్ కొంతమంది మాత్రమే చేయగలరు, నన్ను ఫాలో అయ్యే వాళ్లకు మాత్రమే నా పోస్టులకు కామెంట్ చేస్తే ఇది ఉంటుంది అంటూ వివరించింది.
అలాగే అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్.. వేరే వాళ్ళ పోస్టులపై కామెంట్ చేసే ముందు నీకు కాస్త బుద్ధిని ప్రసాదించమని దేవుని కోరుకుంటున్నా అంటూ కామెంట్ చేసింది. ఆ కామెంట్ కు తన రియాక్షన్ కూడా ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసుకుంటూ.. నా గురించి ఏం మాట్లాడినా నేను భరిస్తా. కానీ నా పిల్లల విషయంలో మాత్రం విషం చిమ్మాలని చూస్తే సహించేది లేదు.. మీరు ఒక తల్లితో డీల్ చేస్తున్నారన్న సంగతి మర్చిపోకండి. నేను ఇలాంటి వాళ్ళను నాశనం చేయగలను అంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం రేణు కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు అఖీరా పై అలాంటి కామెంట్స్ చేసిన వ్యక్తిని బండ బూతులు తిడుతున్నారు.