ఆ తెలుగు హీరో అంటే వరలక్ష్మి శరత్ కుమార్ కి అంత ఇష్టమా..? ఏం చేసిందో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఫేవరెట్ హీరోగా ఉంటాడు అల్లు అర్జున్. ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరోల భార్యలకి కూడా అల్లు అర్జున్ ది మోస్ట్ ఫేవరెట్ హీరోగా ఉన్న విషయం చాలామందికి తెలిసిందే. కాగా రీసెంట్గా ఓ హీరోయిన్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చి అల్లు అర్జున్కి షాక్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్ . కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ కూతురే ఈ విజయ వరలక్ష్మి శరత్ కుమార్. కోలీవుడ్లో హీరోయిన్గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో క్రాక్ – వీర సింహారెడ్డి – నాంది ఇలాంటి సినిమాలలో నటించిన మెప్పించింది .

కాగా రీసెంట్గా వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఇన్నాళ్లు పెళ్లి అంటే దూరంగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతుంది . ఇప్పటికే వీళ్ళ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది . కాగా జూలైలో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు పెళ్లి కార్డు ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చింది .

అయితే తనకు ఎంతో ఫేవరెట్ హీరో అయినా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేసింది . తనకు కాబోయే భర్త నిచోలై సచ్ దేవుని కూడా అల్లు అర్జున్ ఇంటికి తీసుకెళ్లడం గమనార్హం. అల్లు అర్జున్ వాళ్లకు స్పెషల్ ట్రీట్ కూడా ఇచ్చారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. బన్నీ కే కాదు.. డైరెక్టర్ హరీష్ శంకర్, గోపీచంద్ మల్లినేని, సమంత లాంటి స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ ఇచ్చింది..!!