మెగా, అల్లు అభిమానులకు సూపర్ అప్డేట్.. త్వరలోనే పవర్ స్టార్ ను కలవనున్న బన్నీ.. ?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు.. మెగా ఫ్యామిలీకి మధ్య ఇటీవ‌ల కాలం మ‌న‌స్ప‌ర్ధ‌లు చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచి డిప్యూటీ సిఎంగా బాధ్యతలు చేపట్టినా.. ఆయనకు గ‌తంలో మద్దతు కూడా ఇవ్వకపోయినా.. క‌నీసం ఆయన గెలిచిన‌ కలిసి అయ‌న‌ను విష్ కూడా తెలియ‌జేయ‌లేదు. దీంతో మెగా అభిమానులు అంతా బన్నీ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బన్నీ చేస్తున్నది అసలు కరెక్టే కాదు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ కెరీర్ ఉండేది కాదు..కానీ బ‌న్నీ వాటిని మ‌ర్చిపోయి..ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అనది ఎవరికీ అర్థం కావడం లేదు.

Allu Arjun Campaigning For YSRCP | cinejosh.com

ఇక గ‌తంలో వ‌న్నీ పవన్ కళ్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అని అనడం తో అప‌ట్లోనే చాలా వరకు విమర్శలను ఎదుర్కొన్నాడు. కాగా ఇలాంటి క్ర‌మంలో మరొకసారి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి పెద్ద త‌ప్పు చేశాడు. దీంతో మెగా అభిమానుల వ్య‌తిరేక‌త.. ప్ర‌స్తుతం తను చేస్తున్న పుష్ప 2 సినిమా కూడా పోస్ట్ పన్‌ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో బ‌న్నీ ఎక్క‌డ అడుగు పెట్టిన‌ చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుంది. మరి దాన్ని గుడ్ టైం గా మార్చుకునే అవ‌కాశం కోసం బ‌న్నీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Pushpa 2: The Rule Release Postponed, Allu Arjun Reveals New Date -  TheDailyGuardian

ఇక ఇప్ప‌టికైనా వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి బ‌న్నీ కంగ్రాట్స్ చెప్తే బాగుంటుందని చాలామంది మెగా అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే తను కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే కావ‌డంతో.. అతనిని దూరం పెట్టడం మెగా ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు. ఇలాంటి నేప‌ద్యంలో బ‌న్నీ కూడా అందరితో కలిసి ఉంటే.. చాలా బాగుండేది కదా అని.. పలువురు సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ ని కలవడానికి చూస్తున్నాడ‌ని.. ప‌వ‌న్‌ను స్వయంగా బ‌న్నీనే ఇంటికి తీసుకెళ్ళి లంచ్ చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్‌.