“నా కెరియర్ లోనే అది అత్యంత చెత్త సినిమా”.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ టూ బోల్డ్ గా మారిపోతున్నారు .చాలా చాలా ఓపెన్ గా స్పందిస్తున్నారు . కాగా కేవలం యంగ్ హీరోయిన్స్ మాత్రమే అలా మాట్లాడుతున్నారా..? అంటే నో అని చెప్పాలి యంగ్ హీరోయిన్స్ చూసుకొని సీనియర్ హీరోయిన్స్ కూడా ఓ రేంజ్ లో ఘాటు పదాజాలంతో దూసుకుపోతున్నారు . సోషల్ మీడియాలో హీరోయిన్ నయనతార పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.

సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తన కెరియర్ లోనే అతి పరమ చెత్త సినిమా గురించి ఓపెన్ గా బయట పెట్టింది . ఆ సినిమా పేరుతో సహా బయట పెట్టడం సంచలనంగా మారింది. ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నయనతార బుద్ధిలేక సినిమాను ఒప్పుకున్నాను అంటూ టంగ్ స్లిప్ అయింది . “గజిని సినిమాలో తన పాత్ర తనకు ఏమాత్రం నచ్చలేదు అని డైరెక్టర్ మురగదాస్ ఒకలా చెప్పి ఇంకోలా తెరకెక్కించారు అని ..

“ఎడిటింగ్ లో మంచి మంచి సీన్స్ లేపేసారు అని .. అసలు ఆ సినిమాలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని నా కెరియర్ లోనే పరమ చెత్త క్యారెక్టర్ అది” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . నయనతార కెరియర్ ఊపందుకుంటున్న మూమెంట్ లో మరొకసారి ఇదే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . దీంతో నయనతార పేరు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా వైరల్ గా మారింది..!!