మీకు నచ్చిన పేర్లతో పిలిస్తే సహించేది లేదు.. నెటిజన్ పై ఫైర్ అయిన శృతి హాసన్.. ఏం జరిగిందంటే..?!

స్టార్‌బ్యూటీ శృతిహాసన్ ఇటీవల సలార్‌తో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక‌ సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్ గాను తన సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలోను యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులతో ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంటుంది. అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్‌ చేస్తూ మరింతగా ప్రేక్షకుల్లో అభిమానాన్ని పెంచుకుంటుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొంది శృతి. ఇందులో భాగంగా ఓ నెటిజ‌న్‌.. సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవచ్చు కదా అని ప్రశ్నించగా.. దానికి శృతిహాసన్ రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది.

ఓకే.. ఇలాంటి జాతి వివక్షను నేను అసలు సహించను అంటూ వివరించింది. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోశ, సాంబార్ ఇలాంటి పేర్లతో పిలిస్తే మేము ఊరుకునేది లేదు.. మీరు మాకులా ఉండలేరు. కనుక ఎప్పుడూ అనుకరించడానికి ప్రయత్నించకండి. ఎలాపడితే అలా పిలిస్తే దాన్ని మేము కామెడీగా తీసుకోము.. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమని అడిగావు కదా.. నోరు మూసుకొని వెళ్ళు అంటూ వివ‌రించింది. దీనిని శృతి తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. దీంతో శృతిహాసన్ అతనిపై ఫైర్ అయిన స్క్రీన్ షాట్ నెటింట‌ వైరల్‌గా మారింది.

Bhend Idli Vada…" SRK Disrespects Ram Charan Amid The Ambani Pre Wedding  Bash, WATCH - Newsx

కాగా ఇటీవల జరిగిన అనంత్ అంబాని ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుక్ ఖాన్.. రామ్ చరణ్ ను ఇడ్లీ వడ అని పిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో విషయంపై తెలుగు ఆడియన్స్ షారుఖ్ ఖాన్ ఫైర్ అవ్వడమే కాదు.. విపరీతంగా ట్రోల్స్ చేశారు. దీనిపై చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ కూడా మండిపడిన సంగతి తెలిసిందే. అంత పెద్ద స్టార్స్ ను ఇలా ఇడ్లీ, వడ అంటూ పిలవడం ఏంటని మండిపడుతూ పోస్ట్ ని షేర్ చేశాడు. అయితే శృతిహాసన్ కు ఈ విషయంపై అవగాహన ఉండ‌టంతో ఇప్పుడు నెటిజ‌న్‌ను తిడుతున్నట్లే.. షారుక్ ఖాన్‌కు కూడా శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అంటూ.. షారుక్ డైలాగ్‌కు అత‌ని పేరు చెప్ప‌కుండా అత‌నే అన‌ట్లు అంద‌రికి తెలిసేలా భ‌లే తెలివిగా స్పందించిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.