సందీప్ రెడ్డివంగ.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు గురించి ఎవరికీ తెలియదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు . అంతేకాదు అనిమల్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు . సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉన్న కూడా తెరకెక్కించే సత్తా ఉన్నా వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అంటుంటారు జనాలు. చాక్లెట్ బాయ్ లాంటి రన్బీర్ దగ్గర న్యూడ్ క్యారెక్టర్ లో నటింపజేశాడు అంటేనే ఆయన లెవెల్ స్టామినా డెడికేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు .
కాగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెకిస్తున్నాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో సందీప్ రెడ్డివంగా చాలా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నాడట . అంతేకాదు కేవలం బోల్డ్ సినిమాలే కాదు బోల్డ్ కంటెంట్ లేకపోయినా కూడా హిట్ కొట్టగలను అని ప్రూవ్ చేసే విధంగా స్పిరిట్ సినిమాలోని సీన్స్ డిజైన్ చేస్తున్నారట. ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూపించడంతోనే ప్రభాస్ అభిమానులు ఆ విషయాన్ని కనిపెట్టేసారు .
ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫిసర్ గెటప్ లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం..స్పిరిట్ సినిమాలోనే నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో ఒక సీనియర్ బ్యూటీ కూడా నటించబోతుందట. ఆమె కూడా పోలీస్ ఆఫిసర్ పాత్రలోనే నటించబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్ బాగా వైరల్ గా మారింది..!!