యస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఏ బ్యూటీ అయినా సరే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో అవకాశం వస్తే మిస్ చేసుకోదు . అది అందరికీ తెలిసిందే . అయితే శ్రీముఖి మాత్రం మేకర్స్ అడిగినా కూడా ప్రభాస్ సినిమాలో నటించను అని తెగేసి చెప్పేసిందట. ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్ . ఎస్ ఈ సినిమాలో ప్రభాస్ కి సిస్టర్ క్యారెక్టర్ లో శ్రీముఖిని అప్రోచ్ అయ్యారట మేకర్స్ .
ప్రభాస్ లాంటి డార్లింగ్ హీరోకి సిస్టర్ గానా చచ్చిన చేయను అంటూ సినిమా రిజెక్ట్ చేసిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా సంచలనంగా మారింది . అంతేకాదు పలు సందర్భాలలో శ్రీముఖినే స్వయంగా ప్రభాస్ కి వీరాభిమానిని అనే విషయాన్ని ఒప్పుకుంది. యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన శ్రీముఖి పలు సినిమాల్లో కూడా నటించింది . కొందరు హీరోలకి సిస్టర్ రోల్ లో కూడా నటించి మెప్పించింది .బోల్డ్ హీరోయిన్గా కూడా పాత్రలు చేసింది .
కానీ శ్రీముఖి వెండితెరపై కన్నా బుల్లితెర పైన సక్సెస్ అయింది . ప్రెసెంట్ టాప్ యాంకర్ గా తన హవాను కొనసాగిస్తుంది. అందం విషయంలో శ్రీముఖి పాన్ ఇండియా హీరోయిన్స్ కే మించిపోతుంది. అంతేకాదు.. చాలా చాలా టాలెంటెడ్.. ఈ అమ్మాయి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి..!