సౌందర్యను చిరంజీవి అలా ముద్దుగా పిలిచేవాడా..? వీళ్ళ మధ్య ఇలాంటివి కూడా జరిగాయా..?

మనమధ్య కొంతమంది హీరోయిన్స్ లేకపోయినప్పటికీ వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం . దానికి కారణం వాళ్లపై మనకున్న అభిమానమే . ఆ లిస్టులో టాప్ స్థానంలో ఉంటారు మహానటి సావిత్రి-సౌందర్య-శ్రీదేవి ముగ్గురికి ముగ్గురే సూపర్ డూపర్ హిట్ హీరోయిన్స్. నటన విషయంలో వేలెత్తి చూపే ఆస్కారమే లేదు . మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ అనే చెప్పాలి . కాగా సౌందర్య అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది .

ఇండస్ట్రీలో సౌందర్య ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది అన్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ సౌందర్య చిరంజీవికి జాన్ జిగిడి దోస్త్. వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అయితే వీళ్ళ మధ్య చనువు ఎంతలా ఉండేది అంటే చిరంజీవి ముద్దుగా సౌందర్యను సౌ..సౌ అంటూ పిలుచుకునే వాడట . సౌందర్య కూడా చిరంజీవిను అలాగే ట్రీట్ చేసేదట .

చాలా చక్కగా ఆయనతో బిహేవ్ చేసేదట . చాలా ఫ్రెండ్లీ నేచర్ కల వ్యక్తి సౌందర్య అంటూ అప్పట్లో చాలా మంది మేకర్స్ హీరోలు ఆమెను ఓ రేంజ్ లో పొగిడేసేవారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య తెలుగులో అందరి మనసులను దోచుకుంది . కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు జనాలు సౌందర్యాన్ని తెలుగు అమ్మాయిల ట్రీట్ చేశారు . సౌందర్య ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్ స్థానంలోనే ఉంటుంది అని ఇప్పటికీ సౌందర్య ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు..!!