కల్కి సినిమా విషయంలో డబ్బులు ఇచ్చి మరీ ..నాగ్ అశ్విన్ అలా చేయించుకున్నాడా..?

ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు . ఎక్కడ పొగిడే వాళ్ళు ఉంటారో.. అక్కడే తిట్టేవాళ్ళు కూడా ఉంటారు.  ఈ మధ్యకాలంలో కల్కి సినిమా విషయంలో మనం అది బాగా చూస్తున్నాం . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన కల్కి సినిమాపై ఫస్ట్ షో తోనే హిట్ టాక్ అందుకుంది.  అయితే ఆ తర్వాత తర్వాత సినిమాపై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించడం ప్రారంభమయ్యాయి .

మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ డైరెక్షన్ ని ఏమాత్రం నెగిటివ్ గా చూడలేకపోయిన జనాలకు ఆయన సినిమా కోసం ప్రమోషన్స్ నిర్వహించలేదు అన్న విషయాన్ని మాత్రం హైలెట్గా చేసి చూపించారు . సినిమా ప్రమోషన్స్ చేసుంటే ఇంకా భారీ స్థాయిలో కలెక్షన్స్ దక్కించుకునేవి అంటూ కూడా చెప్పుకొచ్చారు . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఆ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో మరొక న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్  డబ్బులు ఇచ్చి మరి పలు సైట్స్ చేత పాజిటివ్ రివ్యూలు రాయించుకున్నాడు అంటూ కొందరు పని పాట లేని వాళ్ళు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు . ఆయనలో ఇలాంటి గుణం కూడా ఉందా ..? అంటూ కొందరు కావాలని తప్పుపడుతున్నారు . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!