బన్నీకి మరీ ఇంత బాడ్ టైం నడుస్తుందా.. బంగారం ముట్టుకున్న బూడిదే అవుతుంది గా..?!

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌గా భారీ క్రేజ్ సంపాదించుకుని పాన్‌ ఇండియాన్ స్టార్‌గా దూసుకుపోతున్న అల్లు అర్జున్‌కు బ్యాడ్ టైం నడుస్తుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణం గత కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున బన్నీ ప్రచారం చేయడమే.. స్నేహం కోసం నంద్యాల వెళ్లి బన్నీ ప్రచారం చేయ‌గా అతను ఓడిపోయాడు. అయితే బన్నీ చిన్న మామ పవన్ కళ్యాణ్.. జనసేన తరపున పోటీ చేస్తుండగా అతనికి ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్ర‌చారం చేయడంతో మెగా అభిమానుల్లో బ‌న్నీ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

Allu Arjun : పవన్ కు షాకిచ్చిన బన్నీ.. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం | allu arjun is touring nandyala. election campaign is being conducted in nandyala favour of ycp candidate

అదే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ బన్నీని సోషల్ మీడియా వేదిక అన్‌ఫాలో చేశాడు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 సినిమా కూడా వాయిదా పడింది. క్వాలిటీ విషయంలో రాజీ పడడం ఇష్టంలేని డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను వాయిదా వేసినట్లు లేటెస్ట్ పోస్ట‌ర్‌తో క్లియర్గా వివరించారు. ఇలా ప్రస్తుతం బన్నీకి ఎందులో ఎంట్రీ ఇచ్చినా చెడు అనుభవాలు ఎదురవుతున్నాయి. మరోవైపు పుష్ప 2 వాయిదా పడడం బన్నీకి మరింత మైనస్ అయ్యేలా ఉంది. కెరీర్‌కు కాస్త గ్యాప్ వచ్చినట్లు అభిమానులు ఫీల్ అవుతున్నారు.

బన్నీ బంగారం ముట్టుకున్న బూడిద అవుతుందంటూ నెటిజన్‌లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల పుష్పా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక బన్నీ పుష్షా సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమా తీస్తున్నాడు. ఈ క్రమంలో పుష్ప 2 పోస్ట్ పోన్ అవడంతో.. ఈ సినిమా రిలీజ్ కి ఎంత టైం పడితే పుష్ప 3 సినిమాకు ఇంకేనేళ్ళు టైం తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే పుష్ప 2 హిట్ అయితే మాత్రం ఈ పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి అనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో బన్నీ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో వేచి చూడాలి.