తిరుములలో శ్రీలీల చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా.. చిన్న వయసులోనే ఎంత మంచి మనసో..!

సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే అభిమానులు ఫోటో అడిగితే ముఖం చిట్లించుకొని పోతారు.. కొంతమంది పదేపదే సెల్ఫీలు అడిగితే తిడుతూ ఉంటారు .. అయితే రీసెంట్ గా హీరోయిన్ శ్రీలీల చేసిన పని మాత్రం అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల తాజాగా తన అమ్మగారితో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది .

ఈ క్రమంలోనే అక్కడ విఐపి విరామ దర్శన సమయంలో ఆమె దైవ సన్నిధిలో పాల్గొనింది. టీటీడీ ఆలయ అధికారులు శ్రీ లీలకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు . కాగా దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం కూడా ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు . స్వామి వారి అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసింది శ్రీ లీల. ఈ క్రమంలోనే బయట తమ ఫ్యాన్స్ అడిగిన వాళ్ళకి కాదు కూడదు అంటూ అనకుండా అందరికీ ఓపికగా సెల్ఫీ ఇచ్చింది.

దీంతో శ్రీలీల ఓపికను అందరు పొగిడేస్తున్నారు . అదే మిగతా హీరోయిన్స్ అయితే ఓ రేంజ్ లో అరిచేసేవారు . ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరా ..? అంటూ ఫైర్ అయ్యేవారు .. శ్రీ లీల చక్కగా అందరికీ అడిగిన వాళ్ళకి సెల్ఫీలు ఇవ్వడం ఇప్పుడు ఆ ఫొటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు శ్రీలీల ప్రసెంట్ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారడానికి మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుంది..!!