“మా నాగార్జున బంగారం”.. ఓ రేంజ్ లో పొగిడిస్తున్న అక్కినేని ఫ్యాన్స్ ..అంత మంచి పని ఏం చేశాడంటే..?

రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురయిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున కి సంబంధించిన ఒక వీడియో బాగా ట్రోలింగ్ కి గురి అయింది . నాగార్జున ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉండగా అభిమాని సెల్ఫీ కోసం దగ్గరికి రాగా నాగార్జున బాడీగార్డ్స్ అతన్ని నెట్టేస్తారు . దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది . కొందరు నాగార్జునను బూతులు కూడా తిట్టారు .

పెద్ద హీరోవి ఆ మాత్రం సెన్స్ లేదా ..? నీ బాడీగార్డ్ అలా తోసేస్తే పట్టి పట్టినట్టు ఎలా ఉన్నావ్ ..? అంటూ మండిపడ్డారు . ఫైనల్లీ ఆ వీడియో పై నాగార్జున కూడా స్పందించారు. ” క్షమించండి నేను చూసుకోలేదు ఇప్పుడే నా దగ్గరికి ఈ విషయం వచ్చింది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను” అంటూ ట్విట్ చేశారు . అయితే రీసెంట్ గా నాగార్జున దివ్యాంగుడైన ఆ అభిమానిని చూసి కౌగిలించుకోవడం ఆయనతో ఫోటో దిగడం ఇప్పుడు నెట్టింట సెన్సేషనల్ గా మారింది .

ఈ క్రమంలోనే అభిమాని కూడా చేతులు జోడించి నాగ్ ని క్షమాపణలు చెప్పాడు . బహుశా తన వల్ల నాగార్జునకి ఇబ్బంది కలిగింది అని అతగాడికి కూడా తెలిసి ఉంటుంది. అందుకే ఇలా క్షమాపణలు చెప్పారు . అయితే నాగార్జున మాత్రం చాలా ఫ్రెండ్లీగా అతగాడిని దగ్గరకు తీసుకొని ప్రేమగా హత్తుకొని ఓదార్చాడు . దీంతో దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇక నాగార్జున ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఆయన పొగడెస్తున్నారు. మా నాగార్జున బంగారం తప్పు చేయకపోయినా సరే ఆ తప్పును సరిదిద్దుకుంటాడు అంటూ ఫుల్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..!!