జక్కన్న దంపతులకు అరుదైన గౌరవం.. అలాంటి ఘనతను సాధించిన మొట్టమొదటి జంట వీళ్ళే..?!

తెలుగు ఇండస్ట్రీలో దర్శక దిగ్గజం రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ప్రతి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకునే రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించాడు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచ న‌లుమూలల పేరును గడించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటాడు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది.

Oscars 2025: SS Rajamouli, Rama Rajamouli, Shabana Azmi, and more Indians receive invitations to join the Academy

ఈ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్ , జూనియర్ ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వాని గతంలో అందించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తాజాగా రాజమౌళి ఆయన సతీమణి రామా రాజమౌళిలకు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులుగా ఆహ్వానాన్ని అందించింది. దీంతో రాజమౌళికి ఇది నిజ‌మైన ప్రైడ్ మూమెంట్గా నిలవనుంది. తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరి లో త‌యారు చేయ‌గా వీరి పేర్లలో రాజమౌళి, రామ రాజమౌళి కూడా స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

SS Rajamouli and his wife Rama groove to an AR Rahman song at a sangeet. Watch - Hindustan Times

ఈ క్రమంలో అకాడమీ వారు వీరిద్దరికి ఆహ్వానం అందించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి, రామ రాజమౌళితో పాటు ఇతర భారతీయ ఆహ్వానితులలో షబానా అజ్మీర్, రితీష్ సిద్వాని, రవివర్మన్ , రిమాదాస్, సీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కరి, షాపౌచ్ హేమల్, త్రివేది గీతేష్ పాండే ఉన్నారు. గత సంవత్సరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎం. ఎం. కీరవాణి, చంద్రబోస్ , కేకే సేంధిల్‌, సాబు సిరిల్ లాంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మకమైన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ నుంచి యాక్సెస్ లభించింది.