వాట్.. కల్కి పాట.. చిరంజీవి సినిమాలోదా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న‌ మూవీ కల్కి 2898 ఏడీతో ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ వ్యక్తి అమితాబ్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే దిశాపటాని హీరోయిన్గా నటిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ నెటింట తెగ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా బుకింగ్స్ విషయంలో అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది కల్కి. ఓవైపు యుఎస్ మార్కెట్లో ప్రీమియర్స్ ద్వారా దాదాపు మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది.

అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ టికెట్స్ బుకింగ్‌తో రికార్డులను సృష్టించిన కల్కి.. మొదటి రోజే రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సినిమా టికెట్స్ వారం పాటు భారీగా రేట్లు పెంచుకోవడానికి ఏపీ, తెలంగాణ గవర్నమెంట్ లో అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సింగిల్ స్క్రీన్కు రూ.75 మల్టీప్లెక్స్ కు రూ.125 పెంచుకునే అనుమతులు గవర్నమెంట్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా చూసిన సెన్సార్ రివ్యూలు, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు అని వస్తున్న రివ్యూస్ ని బట్టి.. సినిమాపై మరింత హైప్ పెరిగింది. మరో వైపు 3d ఐమాక్స్ వర్షన్‌లో సినిమాను రిలీజ్ చేయడం మరింత ప్లస్ అయింది.

Raktha Sindhuram Movie (1985): Release Date, Cast, Ott, Review, Trailer,  Story, Box Office Collection – Filmibeat

ఈ నేపథ్యంలో మరో న్యూస్ నెటింట వైరల్ గా మారింది. చిరంజీవి నటించిన రక్తసింధూరం సినిమాలో కదిలింది.. కదిలింది.. కల్కి అవతారం.. అంటూ అప్పట్లోనే కల్కి గురించి వివరించారు. ఏ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి డ్యూయ‌ల్‌రోల్ చేశాడు. పోలీస్ ఆఫీసర్గా, గండ్ర‌ గొడ్డలి పాత్రలో చిరంజీవి మెప్పించాడంటూ ఆ సినిమాలోని కల్కి పాటను మెగా అభిమానులు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఇదే కల్కి సినిమాగా తెర‌కెక్కిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ సోసియా ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారంటూ మెగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలోను మంచి అంచనాలతో రిలీజ్ అవుతుంది. మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా గ్రాస్వసులు కొల్లగొట్టడం ఖాయమని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.