అందరి ముందే హీరోయిన్ తో అలా ప్రవర్తించిన తమన్.. వీడియో వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు , అదే మూమెంట్లో హీరోయిన్ శ్రీ లీల కూడా తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కాగా ఇదే మూమెంట్లో ఇద్దరు ఎదురు పడ్డారు. ఆ టైంలో చాలా సరదాగా మాట్లాడుకున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

అయితే తమన్ శ్రీ లీలాతో ఉన్న చనువు కారణంగా ఆమె బుగ్గను గిల్లుతాడు . అది చాలా సరదాగా ఫ్రెండ్లీ గానే జరిగింది . అయితే కొందరు జనాలకు మాత్రం అది నచ్చడం లేదు . అలా పబ్లిక్ లో అందరి ముందు బుగ్గ గిల్లడం ఏంటి..? ఆమె ఏమన్నా చిన్న పిల్లనా..? అది కూడా వాళ్ళ అమ్మ ముందు..? సెన్స్ లేదా..? అంటూ కొట్టి పడేస్తున్నారు. తమన్ తన బిహేవియర్ మార్చుకోవాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు .

అయితే తమన్ అలా బుగ్గ గిల్లినా కూడా శ్రీలీల ఇబ్బందికరంగా ఫీల్ అవ్వకుండా నవ్వుతూ మాట్లాడడం అందరికీ షాకింగ్ గా అనిపించింది అంటే స్టార్ సెలబ్రిటీ ఏం చేసినా ఓకేనా..? అదే వేరే వాళ్లు గిల్లితే ఒప్పుకుంటుందా..? అంటూ దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది. జనాలు రకరకాలుగా ఈ వీడియో పై స్పందిస్తున్నారు..!!