వావ్: ఇది మాటల మాత్రికుడు పవర్ అంటే.. దాదాపు రెండు దశాబ్ధాల తరువాత మళ్లీ ఆ పని చేస్తున్న త్రివిక్రమ్..!

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట మారు మ్రోగిపోతుంది . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇండస్ట్రీకి భారీ గ్యాప్ ఇవ్వబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. డైరెక్టర్ గా మారడం కన్నా ముందు రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు వర్క్ చేశారు దర్శకుడుగా మారిన తర్వాత రైటర్ గా తన పనితీరును తగ్గించేశారు . మధ్యలో పవన్ కళ్యాణ్ కోసం తీన్మార్..భింలా నాయక్ లాంటి సినిమాలకు స్టోరీ ఇచ్చారు. ఇతర హీరోలు దర్శకుడు అడిగిన కూడా ఒక్క మెట్టు కూడా దిగలేదు.

అయితే ఇన్నాళ్ళకి త్రివిక్రమ్ లోని రైటర్ ను మళ్ళీ నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇతరుల హీరోల కోసం కథలు రాయడానికి రెడీ అవుతున్నారట త్రివిక్రమ్ . లాస్ట్ గా తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . సోషల్ మీడియాలో ఈ సినిమా కారణంగా త్రివిక్రమ్ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్ని కాదు . త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడుగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లో కలిపి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లో ఆయన సతీమణి సౌజన్యతో వరుస సినిమాల నిర్మిస్తున్నారు .

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాబోయే ఓ సినిమాకు మాట సహాయం కూడా చేయబోతున్నాడట త్రివిక్రమ్ . వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు డైరెక్షన్ కి కొన్నాళ్లపాటు గుడ్ బై చెప్పబోతున్నారట . మళ్లీ తనలోని రైటర్ ను నిద్ర లేపుతున్నాడట. 20 ఏళ్ల కింద రైటర్ గా భారీ పారితోషకం అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎంత తీసుకుంటారు అనేది ఊహించడం కష్టమే ..ఏదేమైనప్పటికీ తనలోని రైటర్ ను బయటకు రప్పించడానికి త్రివిక్రమ్ చేస్తున్న పనులు మాత్రం స్ఫూర్తిదాయకమంటున్నారు అభిమానులు..!!