పుష్ప2.. ఈ పేరు వింటే పూనకాలు రాకుండా ఉంటాయా..? ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం . అఫ్ కోర్స్ ఈ సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ బడాబడా సినిమాలు రాబోతున్నాయి . కానీ 80% జనాలు అందరూ కూడా పుష్పట్టు సినిమాపై హోప్స్ ఎక్కువగా పెట్టుకుని ఉండడం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ గా మారింది. దానికి తగ్గట్టే సుకుమార్ కూడా ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్నారు.
మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా నుంచి “సూసేటి అగ్గి రవ్వ మాదిరి” అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు . దీనికి సంబంధించిన చిన్న ప్రోమో రిలీజ్ చేయగా .. ఆ ప్రోమో సూపర్ హాట్ గా ట్రెండ్ అయింది . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ లోని ఒక పిక్చర్ను పోస్ట్ చేశారు మూవీ టీం. ఆ పోస్టర్లో పుష్పరాజ్ గాడు శ్రీవల్లి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి . మరీ ముఖ్యంగా శ్రీవల్లి వదినా చించి పడేసే రేంజ్ లో స్టెప్ చేసింది అని సింగిల్ పిక్ తోనే ప్రూవ్ చేసేసాడు సుకుమార్ .
దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింత బాగా వైరల్ గా మారింది. ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం అల్లు అర్జున్ పక్క అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈసారి పుష్ప రాజ్ గాడి మానియా అద్దిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అనమాట..!!
View this post on Instagram