అద్దిరిపోయే సూపర్‌ బైక్‌పై..టూ ఎంజాయ్ చేస్తూ.. హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొట్టిన ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ అయినా సెకండ్స్ లోనే వైరల్ అయిపోతూ ఉంటుంది . అలా ఇప్పుడు ఈ బైక్ పై చక్కర్లు కొడుతున్న హీరో ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది . ఈ బైక్ పై చక్కర్లు కొడుతున్న ఫోటో మరెవరిదో కాదు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ది. ఆయన నటిస్తున్న సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ”.

ఫుల్ టు ఫుల్ యాక్షన్ మూవీ . మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ బాగా తెరకెక్కించారు . ప్రజెంట్ అజిత్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు . షూటింగ్ విరామ సమయంలో ఆయన తన ఫేవరెట్ బైక్ పై సరదాగా రైడ్ కు కూడా వెళ్తున్నాడు .

సోమవారం సాయంత్రం కూడా ఆయన తన సూపర్ బైక్ పై హైదరాబాద్ రోడ్లలో చక్కర్లు కొట్టారు . ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో అజిత్ పేరు మారుమ్రోగిపోతుంది . ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన కథనాల ప్రకారం ..ఈ చిత్రంలో అజిత్ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . ఒకటి నెగిటివ్ ..మరోకటి ఫ్లాష్ ప్యాక్ ..మరోకటి యంగ్ లుక్స్ ..2025 పొంగల్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)