ఆ విషయంలో దేవర ముందు ఈ పుష్ప రాజ్ గాడు ఎంత..? మళ్ళీ పెంట పెంట చేస్తున్న ఫ్యాన్స్..!

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ హీరోలకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోకి సపోర్ట్ చేస్తే ప్రాబ్లమే లేదు. అయితే ఒక హీరో ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తూ పక్క హీరోలను ట్రోల్ చేయడానికి చూస్తేనే అసలు సమస్య . ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ నెట్టింట బాగా వైరల్గా మారింది . ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే దేవర -పుష్ప2 సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . త్వరలోనే పుష్ప2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

ఆగస్టు 15వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో హాయ్ చెప్పబోతున్నాడు పుష్ప రాజ్ గాడు . అయితే ఇదే క్రమంలో ఆ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలలకే రిలీజ్ కాబోతున్న దేవర సినిమాపై కూడా హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. రీసెంట్గా దేవర సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ పదివేల మందితో ఫైట్ చేయబోతున్నట్లు ఓ సీన్ లీక్ అయింది .

ఇంతమందిని ఏకతాటిపైకి తీసుకోరావడం చిన్న విషయం ఏమీ కాదు . కెమెరాలో అలాంటి ఫైట్ సీన్స్ బంధించడం కూడా పెద్ద సాహసమే ..డైరెక్టర్కు ఇది ఒక సవాలనే చెప్పాలి.. కొరటాల శివ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి ..దేవర సినిమా సముద్ర నేపధ్యంలో సాగే కథ . ఈ సినిమాలో మునిపెన్నడూ చూడని యాక్షన్స్ ఉంటాయని తెలుస్తుంది . ఎన్టీఆర్ 10000 మందితో ఫైట్ చేయబోతున్నాడట . ఈసీన్ సినిమాకి హైలైట్ గా మారబోతుందట .

ఈ సీన్ చూసిన తర్వాత దేవర సినిమా హైలెట్ కాబోతుందట. పుష్ప సినిమా కూడా ఈ సీన్ ముందు పనికిరాదు అన్న రేంజ్ లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సినిమాపై హ్యుజ్ క్యూరియాసిటీ పెరిగిపోతున్న ఫాన్స్ మధ్య మాటలు యుద్ధం మాత్రం హద్దులు మీరిపోతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సిచువేషన్ ఏ విధంగా మారిపోతుందో అర్థం చేసుకోవచ్చు..??

 

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)