మంచు కుటుంబం కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఫ్యామిలీ ఎప్పుడు ట్రౌలింగ్స్ లో నిలుస్తూనే ఉంటారు. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు ఏ కార్యక్రమానికి హాజరైనా.. వాళ్ళ స్పీచ్ ఊహించని విధంగా ఉండడంతో ట్రోల్స్‌కు గురవుతూనే ఉంటారు. ఇక ట్రోలింగ్ బ్యాచ్ కూడా వీరి స్పీచ్ వస్తుంది అంటే.. కోడి గుడ్డుపై ఈకలు వెతికినట్లు తప్పులు వెతుకుతూ ఉంటారు. వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. మోహన్ బాబు చిరంజీవి పై విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మంచి విష్ణు కూడా మా ఎన్నికల టైం లో ఇచ్చిన స్పీచ్ విపరీతంగా ట్రోల్ అయింది.
మంచి లక్ష్మీ పై కూడా ఇప్పటికే వందలో ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఇంగ్లీష్ మాట్లాడే తీరును వెక్కిరించే విధంగా ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అయితే లక్ష్మి పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడరు. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా ఉండే ఈ అమ్మడు.. తాజాగా తన ఫ్యామిలీ పై జరిగే ట్రోలింగ్స్ పై రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ మాకు రాజకీయాలు తెలియవు.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం. అందుకే మా ఫ్యామిలీని ట్రోల్స్ చేస్తారు. మేము మాట్లాడేది కొంతమంది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు.. కానీ తప్పదు రెండిటిని మేము తీసుకుంటాం.
మమ్మల్ని వాంటెడ్ గా ట్రోల్స్ చేస్తున్నారని నేను అనుకోను. నాకు చరణ్, ఎన్టీఆర్ ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరూ ఫ్రెండ్సే. వాళ్ళ ఫాదర్స్.. మా ఫాదర్స్ కలిసి పెరిగిన వాళ్ళు. సో నాకు నా చుట్టుపక్కల ఉన్న వారందరితో నా ఇంట్లో బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఐ యాం హ్యాపీ అంటూ వివరించింది. మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో మీరు చెప్పింది నిజంగా కరెక్ట్ మేడమ్ అంటూ.. ట్రోలర్స్‌కు సరైన సమాధానం ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మంచు ఫ్యాన్స్.