లవ్ మీ ..ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సినిమా బేబీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత తనదైన స్టైల్ లో లవ్ మీ సినిమాలో నటించి మెప్పించబోతుంది అని అంతా అనుకున్నారు . సినిమా ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమా మరొక బేబీ గా మారిపోతోంది అంటూ ఎక్స్పెక్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే నేడు రిలీజ్ అయిన ఈ సినిమాకు అంత సీన్ లేదు అంటూ తేల్చేశారు జనాలు . కొత్త దర్శకుడు అయినప్పటికీ కథను బాగానే రాసుకున్నాడు కానీ .. ఆ కథను జనాలకు క్లియర్ గా చెప్పడంలో ఫ్లాప్ అయ్యాడు అంటున్నారు .
మరీ ముఖ్యంగా ఆశిష్ పర్ఫామెన్స్ వైష్ణవి చైతన్య పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ సినిమా మొత్తానికి కథ నెగిటివ్గా మారింది అని సినిమా థియేటర్లో సీన్స్ ముందుగానే ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండడం సినిమాకి భారీ మైనస్ అయింది అని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు కథ కూడా ఓ రేంజ్ లో కుమ్మిపడే స్థాయి కాకపోవడంతో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది అంటున్నారు జనాలు . కాగా ఈ సినిమాని మొదటగా హీరోయిన్ శ్రీలీలతో చేయాలి అంటూ భావించారట .
శ్రీలీల కి కూడా కథ చెప్పారట. కానీ శ్రీ లీల ఈ సినిమా కథను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. స్టోరీ వినగానే శ్రీలీల ఎక్కడో తేడా కొట్టిందట . ఇది ఆల్రెడీ చూసిన సినిమాలనే ఉంది ..జనాలు నచ్చదేమో అన్న భయంతో సినిమాను రిజెక్ట్ చేసిందట. దిల్ రాజు వారసుడైన సరే అస్సలు ఆలోచించుకోకుండా ఆమె ఈ కథను రిజెక్ట్ చేసిందట . ఈ సినిమా రిజెక్ట్ చేసి మంచి పనే చేసింది అంటున్నారు అభిమానులు..!!