కేన్స్ లో మొదటిసారి సంచలనం సృష్టించిన భారతీయ నటి.. ఫస్ట్ టైం అవార్డ్..?!

ఇటీవల భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా రికార్డ్ సృష్టించింది. కేన్స్ 2024 ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ లెవెల్‌లో జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్ ‘ విభాగంలో ఉత్తమ నటిగా ఆనసూయ అవార్డ్ ద‌క్కించుకుంది. దీంతో ఈ అవార్డ్ ద‌క్కించుకున్న తొలి భారతీయ నటిగా రికార్డ్ సృష్టించింది. బల్గేరియన్ మూవీ ప్రొడ్యూస‌ర్‌.. కాన్‌స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వంలొ తెర‌కెక్కిన ‘షేమ్‌లెస్’ సినిమాకు గాను ఈ అవార్డు అందుకుంది. అనసూయ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ త‌న సంతోషాన్ని వ్యక్తం చేసుకుంది.

Cannes 2024: Anasuya Sengupta becomes first Indian to clinch top acting award at the film festival – India TV

ఓ పోలీస్ అధికారిని చంపి.. బ్రోతల్ హౌస్ నుంచి ఎస్కేప్ అయ్యిన రేణుక పాత్రలో ఈమె నటించిన మెప్పించింది. ఇక అనసూయ లవర్ పాత్రలో ఒమన్ శెట్టి నటించాడు. కాగా తన సినిమా కేన్స్ అన్సటైన్ రిగార్డ్ సెక్షన్కు సెలెక్ట్ అయిందని డైరెక్టర్ చెప్పగానే ఎగిరి గంతేసానని.. ఆమె ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఇక అనసూయ కాకుండా.. ఇండియా కు సంబంధించిన మ‌రో రెండు షార్ట్ ఫిలిమ్స్ సన్ఫ్లవర్, బన్నీహుడ్ ఈ ఏడాది కేన్స్ లా సినీఫ్ సెక్షన్ లో ఫస్ట్, థర్డ్ ప్లేస్ లు దక్కించుకోవడం విశేషం.

Cannes Film Festival 2024: Anasuya Sengupta Creates History, First Indian To Get Best Actress Award

అనసూయ సినిమా రంగంలో ఉన్నా.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎప్పుడు కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం గోవాలో నివసిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ షో ‘మసబా మసబాస సినిమా ప్రొడెక్ష‌న్‌లో కీలకపాత్ర పోషించిన ఈ అమ్మ‌డు.. బెంగాలీ డైరెక్ట‌ర్‌ అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీ మూవీలో తొలిసారి నటించింది. 2009లో ఈ మూవీ రిలీజైంది. ఇక తర్వాత ఆమె నటనకు దూరమై మ‌ళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అంజన్ దత్ సాయంతోనే షేమ్‌లెస్ సినిమాలో కనిపించింది. అలా త‌న రెండ‌వ సినిమాతోనే ఉత్తమ నటిగా అవార్డ్‌ను అందుకోవ‌డ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాని క‌ల్పిస్తుంది.