బిగ్ షాకింగ్: ఆ బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆగిపోయిందా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ అవుతుంది..? ఎప్పుడు ఏ సినిమా నుంచి ఏ స్టార్ అవుట్ అవుతాడు..? కొత్త స్టార్ ఎంట్రీ ఇస్తాడు..? అని చెప్పడం పెద్ద టఫ్ జాబ్ . అంతేకాదు ఈ మధ్యకాలంలో బడా బడా సినిమాలు కూడా సెట్స్ పైకి రాకముందే ఆగిపోతున్నాయి . దానికి కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ బడా హీరో సినిమా అలా ఆగిపోతే మాత్రం ఆ బాధ నిజంగా వర్ణాతితం . అలాంటి బాధను ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ .

ఎస్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ పిచ్చ బిజీగా మారిపోయారు కొందరు . ఈ సినిమా హిట్ అవుతుంది అంటుంటే మరి కొందరు అంత సీన్ లేదు అంటూ తేల్చి పడేస్తున్నారు . అయితే ప్రభాస్ నెక్స్ట్ సెట్స్ పై కి తీసుకురావాల్సిన సలార్ 2 కూడా వెనక్కి వెళ్ళిపోయింది . ఎన్టీఆర్ తో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆగస్టులో సెట్స్ పైకి తీసుకొస్తామంటూ కూడా ప్రకటించేసాడు. దీంతో సలార్ 2 మరింత ఆలస్యం కాబోతుంది అంటూ ప్రచారం జరిగింది . అయితే ఇప్పుడు సలార్ 2 సినిమా ఆగిపోయింది అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది .

ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపై పడుతుంది . ఆ ప్రెజర్ బాగా బాగా పెరిగిపోతుంది . సలార్2 సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ మరింత కేర్ తీసుకోవాల్సిన టైం కూడా ఉంటుంది . అందుకే ప్రభాస్ కల్కి సినిమా రిజల్ట్ బట్టి ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట . అన్ని సక్రమంగా జరిగితే ది రాజా సాబ్ సినిమాతో పాటే స్పిరిట్ సినిమాకి తీసుకొచ్చి మొదటగా స్పిరిట్ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట . సలార్ 2 పై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అభిమానులకు ఇది వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . అయితే ఈ విషయంపై అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం..!!