ఆ సమస్యతో ఆరు రోజులు చాలా ఇబ్బంది పడ్డ.. అసలు మాట్లాడలేకపోయా.. విశ్వక్ షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ తను నటించిన సినిమాలతో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని.. విశ్వక్ ట్రైలర్ లో టైగర్ అంటూ డైలాగ్స్ చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న విధానం అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Gangs of Godavari (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

మాస్ ఫాన్స్ కు నచ్చే విధంగా ఈ ట్రైలర్ కట్ చేయడం విశేషం. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు సంబంధించిన ఒక్క ప్రేమ్ కట్‌ కూడా ఆయన చూడలేదని చూడకుండానే సినిమా రిలీజ్ అవుతుందంటూ వివరించాడు విశ్వక్. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని.. తనకు గొంతు పట్టేయడంతో షూటింగ్ ఆపేశానని.. ఆరు రోజులు అసలు మాట్లాడలేకపోయానని.. దీంతో షూటింగ్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇక ఈనెల 31న సినిమా రిలీజ్ కానుంది. విశ్వక్ నటించిన ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే ఆయన నటుడుగా మరో లెవెల్ కు వెళ్తాడు అనడంలో సందేహం లేదు. విశ్వక్ రెమ్యున‌రేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందని టాక్. ఇక ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఎంతో స్పెషల్ మూవీ గా నిలిచిపోతుందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు విస్వ‌క్‌ను అభిమానించే అభిమానుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.